Sai Pallavi: సాయి పల్లవి షాకింగ్ నిర్ణయం.. ఫ్లాపులే కారణమా..?

Sai Pallavi: ముందుగా హీరోయిన్లు కొన్ని లిమిటేషన్స్‌తోనే ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. కానీ సమయం గడుస్తున్న కొద్దీ కొన్ని కాంప్రమైజ్‌లు చేసుకోవాల్సి వస్తుంది. అలా లేకపోతే అవకాశాలు కోల్పోతారు. ఇది ఇండస్ట్రీ గురించి అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. అలాగే సాయిపల్లవికి కూడా కేవలం ఇలాంటి పాత్రలు మాత్రమే చేయాలి అని ఒక క్లారిటీ ఉంది. కానీ వాటి వల్లే వరుసగా ఫ్లాపులు కూడా ఎదురవుతున్నాయి. దీని వల్లే తాను ఓ నిర్ణయానికి వచ్చిందట.
పాత్రలకు ప్రాధాన్యత ఉండే సినిమాలు చేస్తూ కమర్షియల్ చిత్రాలకు ఎక్కువశాతం దూరంగా ఉంటుంది సాయి పల్లవి. గ్లామర్ పాత్రలు చేయడానికి తను ఇష్టపడదు. వైవిధ్యభరితమైన కథలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే సాయిపల్లవి ఒక సినిమాకు సైన్ చేయాలంటే చాలా విధాలుగా ఆలోచిస్తుంది. కానీ గత కొంతకాలంగా సాయిపల్లవి లెక్కలు తప్పుతున్నాయి.
సాయి పల్లవి ఓ సినిమా చేస్తుందంటే అక్కడే ఆ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోతుంది. అంతే కాకుండా తను ఏ పాత్ర చేసినా.. దానికి పూర్తిస్థాయిలో న్యాయం కూడా చేస్తుంది. కానీ కమర్షియల్‌గా సక్సెస్ అవ్వలేక నిర్మాతలకు నష్టాలు తప్పడం లేదు. దీంతో సాయి పల్లవి కాస్త కమర్షియల్ సినిమాలపై దృష్టిపెడితే బాగుంటుందని సలహా ఇచ్చారట. కానీ తను మాత్రం సినిమాలు లేకపోతే క్లినిక్ పెట్టుకుంటానని లేదా ఉద్యోగం చేసుకుంటానని తేల్చి చెప్పిందట. దీంతో సాయి పల్లవి కెరీర్ ఎంతవరకు ఇలా సాగుతుందో తెలియక అభిమానులు అయోమయంలో పడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com