Sai Pallavi: సాయి పల్లవికి పొలిటీషియన్ కుమారుడి పెళ్లి ప్రపోజల్..?

Sai Pallavi: మామూలుగా స్క్రీన్‌పై చూసిన నటీనటులంటే ప్రేక్షకులకు అభిమానం కలుగుతుంది. ఆ అభిమానం మరీ ఎక్కువయితే వారిని ఆరాధించడం మొదలుపెడతారు. అంతే కాకుండా వారినే తమ కలల రాకుమారుడిగా లేదా రాకుమారిగా చూడడం మొదలుపెడతారు. వారిని కలిసినట్టు ఊహల్లో తేలియాడుతారు. కానీ సాయి పల్లవిపై అభిమానంతో ఒక పొలిటీషియన్ కుమారుడు ఏకంగా పెళ్లే చేసుకోవాలనుకున్నాడు.
సాయి పల్లవి.. మల్టీ టాలెంటెడ్‌కు పెట్టింది పేరు. ఓవైపు డాక్టర్‌లాంటి వృత్తిలో ఉంటూనే మరోవైపు నటిగా ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ను అలరిస్తోంది. అంతే కాకుండా తను నటించే ప్రతీ సినిమాలో ప్రేక్షకులను మైమరిపించే డ్యాన్సులు కూడా చేస్తుంది. ఇక సాయి పల్లవి ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ చూస్తుంటే ఎంత ఫేమ్ ఉన్నా ఏ మాత్రం గర్వం లేనట్టుగా అనిపిస్తుంది. అందుకే తనంటే చాలామందికి అభిమానం, ఇష్టం.
సాయి పల్లవి అందం చూసి ఫిదా అయిన ఓ పొలిటీషియన్ కొడుకు.. తన తండ్రిని సాయి పల్లవి ఇంటికి పెళ్లి కోసం సంప్రదింపులకు పంపించాడట. కానీ సాయి పల్లవి ఈ సంబంధాన్ని సున్నితంగా తిరస్కరించిదట. తనకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని చెప్పిందట. అంతే కాకుండా పొలిటీషియన్ కొడుకును అస్సలు పెళ్లి చేసుకోను అని క్లారిటీ ఇచ్చేసిందట. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియక ముందే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com