Sai Pallavi: అంత నొప్పిలోనే డ్యాన్స్ చేశాను: సాయి పల్లవి

Sai Pallavi: నటీనటులు ఒక్కసారి కెమెరా ముందుకు వచ్చిన తర్వాత బయట ప్రపంచాన్నే మర్చిపోవాలి. అలా అయితేనే వారు చేసే క్యారెక్టర్‌కు పూర్తి న్యాయం చేయగలరు. అలాంటి సమయంలోనే వారి లైఫ్‌లో ఇంకేది జరుగుతున్న అదేది పట్టించుకోకూడదు. అలాగే సాయి పల్లవి కూడా తన హిట్ డ్యాన్స్ పాటలను షూట్ చేస్తున్న సమయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డానని ఇటీవల బయటపెట్టింది.
సాయి పల్లవిని నేచురల్ యాక్టర్‌గానే కాదు.. ఒక డ్యాన్సర్‌గా కూడా ప్రేక్షకులు అభిమానిస్తారు. ముఖ్యంగా తను చేసే ప్రతీ సినిమాలో డ్యాన్స్ హైలెట్ అయ్యేలా ఏదో ఒక పాట ఉండాలని అభిమానులు కోరుకుంటారు. అయితే అలాంటి సమయంలో తనకు బాగా లేకపోయినా అలా డ్యాన్స్ చేయాల్సి వచ్చిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది సాయి పల్లవి.
'పీరియడ్స్ సమయంలో డ్యాన్స్ చేయడం చాలా కష్టమనిపిస్తుంది. శారీరికంగా అది నాపై చాలా ప్రభావం చూపించింది. చాలా అలసిపోయినట్టు అనిపించేది కానీ డ్యాన్స్ చేయాల్సి వచ్చేది. శ్యామ్ సింగరాయ్‌లో నేను చేసిన క్లాసికల్ డ్యాన్స్ దగ్గరి నుండి ఇప్పటివరకు నేను చేసిన పాటలన్నీ పీరియడ్స్ సమయంలో చేసినవే. రెండు, మూడు రోజులు పనిచేసిన తర్వాత ఒకేసారి రెస్ట్ తీసుకునేదాన్ని. అదే సమయంలో మా నాన్న నా కాళ్లకు మసాజ్ చేసేవారు' అని తన డ్యాన్స్ వెనుక కష్టాన్ని బయపెట్టింది సాయి పల్లవి.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com