Sai Pallavi: అబ్బాయికి లవ్ లెటర్ రాసి తల్లిదండ్రుల చేతిలో దెబ్బలు తిన్న సాయి పల్లవి..

Sai Pallavi: అబ్బాయికి లవ్ లెటర్ రాసి తల్లిదండ్రుల చేతిలో దెబ్బలు తిన్న సాయి పల్లవి..
Sai Pallavi: విరాటపర్వంలో హీరోకు లెటర్ రాసే సీన్‌కు తాను కనెక్ట్ అయ్యానని చెప్పింది సాయి పల్లవి.

Sai Pallavi: సౌత్ ఇండస్ట్రీలో కేవలం నటనతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ.. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ సాయి పల్లవి అందరికీ దగ్గరయ్యింది. ఇప్పుడు మరో నటనా ప్రాధాన్యత ఉన్న 'గార్గి' చిత్రంతో మన ముందుకు రానుంది సాయి పల్లవి. జులై 15న విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో సాయి పల్లవి బిజీగా పాల్గొంటోంది. అందులో భాగంగానే తన చిన్ననాటి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని ప్రేక్షకులతో పంచుకుంది.

జూన్ 17న విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సాయి పల్లవి. ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. సాయి పల్లవి నటనకు మాత్రం నూటికి నూరు మార్కులు పడ్డాయి. ముందు నుండి మేకర్స్ చెప్పినట్టుగానే విరాటపర్వం.. సాయి పల్లవి సినిమాగా నిలిచింది. అప్పుడే ఇది ఓటీటీలో కూడా విడుదలయ్యి మంచి రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఇక ఈ మూవీలో తనకు బాగా కనెక్ట్ అయిన సీన్ గురించి చెప్పుకొచ్చింది సాయి పల్లవి.

విరాటపర్వంలో హీరోకు లెటర్ రాసే సీన్‌కు తాను కనెక్ట్ అయ్యానని చెప్పింది సాయి పల్లవి. తాను కూడా నిజ జీవితంలో ఓ అబ్బాయికి ప్రేమలేఖ రాశానని బయటపెట్టింది. తాను 7వ క్లాస్‌లో ఉన్నప్పుడే ఓ అబ్బాయికి లవ్ లెటర్ రాసిందట సాయి పల్లవి. ఆ విషయం తన తల్లిదండ్రులకు తెలిసి తనను బాగా కొట్టారట కూడా. అయితే ఈ విషయాన్ని చెప్తూ ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేను అంటోంది సాయి పల్లవి. అంతే కాకుండా తాను లెటర్ రాసిన విషయం తన తల్లిదండ్రులకు తెలుస్తుందని అనుకోలేదని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story