Sai Pallavi: 'విరాటపర్వం' రిజల్ట్‌పై నోరువిప్పిన సాయి పల్లవి..

Sai Pallavi: మామూలగా ఏ సినిమా అయినా హిట్ అవ్వాలన్న ఉద్దేశ్యంతోనే మూవీ టీమ్ అంతా కష్టపడుతుంది. కచ్చితంగా ఆ మూవీ ప్రేక్షకులకు నచ్చుతుంది అని నమ్మినప్పుడే సినిమాను విడుదలకు సిద్ధం చేస్తుంది. కానీ విడుదలయిన అన్ని సినిమాలు హిట్ అవ్వవు కదా..! కొన్ని అంచనాలు తారుమారవుతుంటాయి. ఒకవేళ మూవీ ఫ్లాప్ అయితే దాని గురించి మాట్లాడడానికి మూవీ టీమ్ ఎక్కువశాతం ఇష్టపడదు. కానీ సాయి పల్లవి మాత్రం విరాటపర్వం రిజల్ట్ గురించి మొదటిసారి స్పందించింది.
రానా, సాయి పల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే 'విరాటపర్వం'. ఇందులో సాయి పల్లవి.. వెన్నెల పాత్రలో.. ఓ ఉద్యమకారుడిని ప్రేమించే అమ్మాయిగా నటించింది. ఇందులో సాయి పల్లవి నటనకు మంచి మార్కులే పడ్డాయి. కానీ మూవీ మాత్రం కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోయింది. అందుకే థియేటర్లలో విడుదయిన రెండు వారాలకే ఓటీటీలో కూడా వచ్చేసింది.
ఫలితంతో సంబంధం లేకుంగా నటిగా విరాటపర్వం తనకు సంతృప్తినిచ్చిందంటోంది సాయి పల్లవి. ప్రేమ, కోపం, దుఖం లాంటి అన్ని రకాల ఎమోషన్లు ఓకే సినిమాలో పండించే అవకాశం చాలా అరుదుగా దొరుకుతాయని, ఆ అవకాశం విరాటపర్వం సినిమాతో తనకు దక్కిదని తెలిపింది. గతంలో తాను చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా వెన్నెల క్యారెక్టర్ సాగిందని, అందుకే సినిమాలను అంగీకరించే ముందు తాను రిజల్ట్‌పై ఎలాంటి ఆశలు పెట్టుకోనని స్పష్టం చేసింది. దీంతో ఫ్లాప్ అయిన సినిమా గురించి సాయి పల్లవి చాలా బాగా మాట్లాడిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com