Sai Pallavi: నెల వ్యవధిలో సాయి పల్లవి మరో సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్..

Sai Pallavi: మామూలుగా హీరోలు స్పీడ్‌గా సినిమాలు చేయడం గురించి చర్చించుకుంటాం కానీ.. హీరోయిన్ల స్పీడ్ గురించి చర్చించుకునే వారు చాలా తక్కువ. వారు నటించిన ఒక్క సినిమా సూపర్ హిట్ అవ్వగానే హీరోయిన్ల కాల్ షీట్స్ కోసం నిర్మాతలు క్యూ కడతారు. కానీ అందులో సెలక్టివ్‌గా కథలను ఎంచుకుని ఓకే చేసేవారు కూడా ఉంటారు. అందులో ఒకరు సాయి పల్లవి.
సాయి పల్లవి దగ్గరకు ఎన్ని సినిమా ఆఫర్లు వచ్చినా.. తను చాలా సెలక్టివ్‌గా ఉంటుంది అన్నది తెలిసిన విషయమే. అందుకే కంగారుగా సినిమాలు చేయకుండా కాస్త సమయం గడిచినా కూడా తనకు నచ్చిన కథల కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక సాయి పల్లవి చివరిగా 'విరాటపర్వం' చిత్రంలో మెరిసింది. ఈ సినిమాతో మరోసారి తన యాక్టింగ్‌కు ప్రశంసలు అందుకుంది.
జూన్ 17న థియేటర్లలో విడుదలయిన విరాటపర్వం.. అప్పుడే ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఇక నెలరోజులు గడవక ముందే సాయి పల్లవి తన మరో సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచింది. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో సాయి పల్లవి నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'గార్గి' జులై 15న ప్రేక్షకుల ముందుకు రానుందని తానే స్వయంగా ప్రకటించింది. ఇక ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా విడుదల కానుంది.
#Gargi will be Yours from the 15th of July! @prgautham83 @kaaliactor @SakthiFilmFctry @2D_ENTPVTLTD pic.twitter.com/Gg9w5JCgPl
— Sai Pallavi (@Sai_Pallavi92) July 2, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com