Salaar: జులై 6న "సలార్" టీజర్

Salaar: జులై 6న సలార్ టీజర్
ఈ ఏడాదిలో విడుద‌ల‌వుతున్న బిగ్గెస్ట్ మూవీ ‘స‌లార్‌’. బాహుబ‌లి ఫ్రాంచైజీతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులు అంచ‌నాలకు ధీటుగా ప్రశాంత్ నీల్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హోంబ‌లే ఫిలింస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ మూవీ ‘సలార్’. ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’ జూలై 6న టీజర్ఎంటైర్ ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో విడుదలకి సిద్దమైంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా KGFతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ద‌ర్శక‌త్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రమిది. ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచి అంద‌రిలో ఎగ్జయిట్‌మెంట్‌ను పెంచుతోంది. ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్‌, ప్రేక్షకులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మేక‌ర్స్ ‘స‌లార్’ టీజ‌ర్‌ను జూలై 6 ఉద‌యం 5 గంట‌ల 12 నిమిషాల‌కు విడుద‌ల చేస్తున్నట్లు ప్రక‌టించారు.


ఈ ఏడాదిలో విడుద‌ల‌వుతున్న బిగ్గెస్ట్ మూవీ ‘స‌లార్‌’. బాహుబ‌లి ఫ్రాంచైజీతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులు అంచ‌నాలకు ధీటుగా ప్రశాంత్ నీల్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న తొలి సినిమా ఇది.‘‘‘సలార్’టీజ‌ర్‌ను జూలై 6న అన్నీ భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు. KGF2, కాంతార చిత్రాల‌తో ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్టర్స్‌ను సొంతం చేసుకున్నాం. ఇప్పుడు మా బ్యాన‌ర్ నుంచి ప్రభాస్ హీరోగా మ‌రో భారీ బ‌డ్జెట్ సినిమా స‌లార్ రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా సరికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తుంద‌న‌టంలో సందేహం లేద‌ర‌. ఈ మెగా యాక్షన్ ప్యాక్డ్ మూవీ టీజ‌ర్‌ను చూడ‌టానికి ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నార‌ని తెలుసు. దాన్ని రిలీజ్ చేయ‌టానికి స‌ర్వం సిద్ధంగా ఉంది’’ అని హోంబలే ఫిలింస్ ప్రతినిధులు తెలిపారు.ప్రభాస్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమార్‌, శ్రుతీ హాస‌న్‌, జ‌గ‌ప‌తి బాబు, త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్న పాన్ ఇండియా భారీ చిత్రం ‘స‌లార్‌’ను సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story