Salman Khan: సౌత్ సినిమాలపై సల్మాన్ ఫోకస్.. మరో మెగా హీరోతో మూవీ..

Salman Khan: సౌత్ సినిమాలు ఇప్పుడు భాషలకు అతీతంగా విజయాన్ని అందుకుంటున్నాయి. అందుకే ప్రతీ ఇండస్ట్రీలోని హీరో.. మరో భాషలో సినిమాలు చేయడానికి వెనకాడడం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ నటీనటులు.. సౌత్, నార్త్ అని సరిహద్దులు చెరిపేస్తూ.. కథ నచ్చితే ఏ భాషలో అయినా నటించడానికి ఓకే చెప్పేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ ఖండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా టాలీవుడ్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా అనిపిస్తోంది.
సల్మాన్ ఖాన్ సినిమాలు తెలుగులో డబ్ అవ్వకపోయినా.. దానిని హిందీలో చూసి ఎంజాయ్ చేస్తారు తెలుగు ప్రేక్షకులు. అందుకే తెలుగులో కూడా సల్మాన్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక హీరోగా ఇన్నాళ్లు బాలీవుడ్‌లో తన సత్తా చాటుకున్న తర్వాత తొలిసారి తెలుగుతెరపై మెరవనున్నాడు సల్మా్న్. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'గాడ్ ఫాదర్'లో సల్మాన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇంతలోనే తాను మరో మెగా హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్టు టాక్ వినిపిస్తోంది.
కొన్నిరోజుల క్రితం సల్మాన్ ఖాన్‌తో భేటీ అయ్యాడు హరీష్ శంకర్. అయితే హరీష్.. బాలీవుడ్‌లో దర్శకుడిగా డెబ్యూ చేయనున్నాడని, అందుకే ఆ మీటింగ్ అని అంతా అనుకున్నారు. కానీ అసలు విషయం వేరే ఉందట. హరీష్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న `భవదీయుడు భగత్ సింగ్` చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం సల్మాన్‌ను సంప్రదించాడట ఈ దర్శకుడు. ప్రస్తుతం ఈ రూమర్స్ ఫిల్మ్ సర్కిల్లో వైరల్ అవుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమయితే.. ఈ మెగా హీరోలతో సల్మాన్ ఖాన్ చేయడం ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నట్టే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com