Samajawaragamana Glimpse : శ్రీ విష్ణు లవ్ స్టోరీలో కొత్త ప్రాబ్లమ్

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన 'సామజవరగమన' సినిమా ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉంది. శ్రీ విష్ణు పుట్టినరోజు సందర్భంగా సినిమా గ్లింప్స్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ప్రతీ లవ్ మ్యారేజ్ లో లవ్ ప్రాబ్లం ఉంటుంది. లేదా క్యాస్ట్ ప్రాబ్లమ్ ఉంటుంది. కానీ సామజవరగమనలో మాత్రం ఇప్పటివరకు చూడని ప్రాబ్లం ఉండనుందని సస్పెన్స్ ను క్రియేట్ చేసింది చిత్ర యునిట్. ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు.
ప్రతీ లవ్ మ్యారేజ్ లో క్యాస్ట్ ప్రాబ్లం, క్యాష్ ప్రాబ్లం ఉంటుంది. కానీ నా లవ్ స్టోరీలో ఇలాంటి ప్రాబ్లమ్ ఉంటుందా అని శ్రీ విష్ణు చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. వీడియోను గమనిస్తే హీరోకు ఏదో తెలియని వింత ప్రాబ్లమ్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. శ్రీ విష్ణు కెరీర్లో మొదటి నుంచి కూడా విభిన్న జానర్లలో సినిమాలను చేసాడు. ఈ సినిమా కూడా తన కేరీర్ లో నిలిచిపోయే చిత్రంగా అవనుందని చిత్ర యునిట్ తెలిపింది.
శ్రీవిష్ణు సరసన రెబా మోనికా హీరోయిన్ గా చేస్తుంది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తుండగా, గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ పతాకంపై అనిల్ సుంకర చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com