Samantha: సమంతకు ఆ హీరో క్రిస్మస్ గిఫ్ట్; మరింత ధృఢంగా మరతానంటూ పోస్ట్

Samantha: సమంతకు ఆ హీరో క్రిస్మస్ గిఫ్ట్; మరింత ధృఢంగా మరతానంటూ పోస్ట్
పండగ రోజున సమంత ఎమోషనల్ పోస్ట్; అనారోగ్యంతో పోరాడి గెలుస్తానంటూ ఆత్మవిశ్వాసం; అందరూ ధృఢంగా ఉండాలంటూ పిలుపు

Samantha: సమంతకు ఆ హీరో క్రిస్మస్ గిఫ్ట్; మరింత ధృఢంగా మరతానంటూ పోస్ట్


ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాన్ని అంటాయి. మరోవైపు పలువురు సెలబ్రిటీలు తమ సెలబ్రేషన్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుని మురిసిపోయారు. అయితే సమంత మాత్రం ఒక ఎమోషనల్ పోస్ట్ తో అభిమానులను కట్టిపాడేసింది.


సమంతకు సింగర్ చిన్మయి, ఆమె భర్త హీరో కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఎంత మంచి స్నేహితులో అందరికీ తెలిసిందే. అయితే క్రిస్మస్ పురస్కరించుకుని రాహుల్ సామ్ కు ఓ కస్టమైజ్డ్ గిఫ్ట్ పంపించారు. అయితే గిఫ్ట్ కన్నా, దానిపై ఆమె కోసమే రాసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. 'చుట్టూ చీకట్లే ఉన్నా ధైర్యంగా ముందుకు వెళ్లగలిగే ధైర్యవంతురాలివి, ఉక్కుతో నిర్మించబడ్డ నువ్వు ముందుకు సాగుతుంటే వెలుగులు విరజిమ్ముతాయి. కాస్త ఆలస్యమైతేనేమి నువ్వు ఓటమిని అంగీకరించేదానివి కావు, పోరాటయోధురాలివి. నిన్ను ఏదీ ఓడించలేదో అదే, నిన్ను మరింత ధృఢంగా మార్చుతుంద'ని ఉద్దేశించిన సందేశం నెటిజన్లలో కూడా ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. రాహుల్ పంపిన సందేశంతో కూడిన గిఫ్ట్ ను సమంత ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు అది వైరల్ గా మారింది.


ఇక రాహుల్ గిఫ్ట్ కు రిప్లై ఇచ్చిన సమంత తనలాగా జీవితంలో క్లిష్ఠమైన యుద్ధాలు చేస్తున్నవారందరికీ ఈ సందేశాన్ని అంకితం ఇచ్చింది. 'పోరాడుతూనే ఉండండి, ధృఢంగా మారదాం, జీవితాంతం ధృఢంగా మారేంత వరకూ' అంటూ తన ఇన్ట్సా హ్యాండిల్ లో పోస్ట్ చేసింది.


ఇటీవలే సమంత తన అనారోగ్యం నిమిత్తం ఓ చిన్న బ్రేక్ తీసుకోబోతోంది అని వినిపించిన వార్తల నేపథ్యంలో ఈ పోస్ట్ మరింత ఉత్సుకతను రేకెత్తిస్తోంది. అయితే చికిత్స కారణంగా సామ్ ఎలాంటి ప్రాజెక్ట్ ల నుంచి తప్పుకోవడంలేదని ఆమె పీఆర్ టీమ్ స్పష్టం చేసింది. త్వరలోనే ఆమె సైన్ చేసిన ప్రాజెక్ట్ షూటింగ్ ల్లో పాలుపంచుకోబోతోందని తెలిపింది.


Tags

Read MoreRead Less
Next Story