Samantha: ఫ్యాన్స్‌కి పండగే.. మామ లుక్స్‌ని మెచ్చుకున్న కోడలు..

Samantha: వివాదాలు సమసిపోతున్నట్లే అనిపిస్తున్నాయి.. సమంత అక్కినేని ఇంటి పేరు తొలగించినది మొదలు చిలువలు పలువలుగా వార్తలు.. క్యూట్ కపుల్ విడిపోవద్దని కోరుకునే అభిమానులు చాలా మంది ఉన్నారు. వస్తున్న వార్తలపై చైతూ, సామ్ స్పందించకపోయినా మొన్నటికి మొన్న తిరుపతి దైవదర్శనానికి వెళ్లిన సామ్ విలేకరి అడిగిన ప్రశ్నకు అతడి మీద ఫైర్ అవడం, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు వస్తున్న రూమర్లకి ఉప్పందించినట్లైంది.
నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ ఈనెల 24న రిలీజ్ అవుతున్న దశలో సాయి పల్లవికి మాత్రమే విషెస్ చెప్పడం.. చూస్తుంటే ఇద్దరి మధ్యా ఏదో జరిగిందనే తెలుస్తుంది. అయితే నిన్న అక్కినేని నాగార్జున తన చిత్రం బంగార్రాజు లుక్‌ను విడుదల చేస్తూ, తండ్రిని గుర్తు చేసుకున్నారు. తండ్రిలా పొందూరు ఖద్దరు పంచెకట్టుకుని, తన తండ్రి వాడిన నవరత్నాల హారాన్ని ధరించి.. ఇప్పుడు నాన్న నాతోనే ఉన్నట్టుంది అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు నాగార్జున లుక్స్ చూసి మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు. అలాగే ఆయన కోడలు సమంత కూడా పాజిటివ్‌గా స్పందించింది. సో బ్యూటిఫుల్ మామా అంటూ నాగ్ లుక్‌ను ప్రశంసించింది. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే సమంత ముందు మామ అనే పదాన్ని జోడించకుండా ట్వీట్ చేశారు. కానీ వెంటనే దాన్ని తొలగించి మామ అనే పదాన్ని యాడ్ చేసి రీట్వీట్ చేశారు. సమంత తన భర్త నాగ చైతన్యతో విడాకుల రూమర్స్ మధ్య నాగార్జునను మామా అని సంబోధించడం అభిమానులకు సంతృప్తినిస్తుంది. గత కొన్ని వారాలుగా, సమంత, నాగ చైతన్య మధ్య బంధం సరిగ్గా లేదని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
జూలైలో, సమంత తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో డిస్‌ప్లే పేరును S గా మార్చి, తన ఇంటిపేరు అక్కినేనిని వదులుకుంది. ఇది అక్కినేని కుటుంబంతో ఆమె సంబంధంలో కొంత ఇబ్బంది ఉందనే ఊహాగానాలకు దారితీసింది. అయితే, ఆమె ఫేస్‌బుక్ పేజీలోని డిస్‌ప్లే పేరు ఇప్పటికీ సమంత అక్కినేని అని ఉంది. సమంత తన ఇతర సోషల్ మీడియా పేజీలలో తన పేరును S గా ఎందుకు మార్చుకుందో ఇంకా వివరించలేదు.
కాగా, సమంత తెలుగు పీరియాడికల్ డ్రామా శాకుంతలం చిత్ర షూటింగ్‌ను ఈ మధ్యే పూర్తి చేసుకుంది. తమిళంలో రొమాంటిక్-కామెడీ కథా చిత్రంలో నటించనుంది. అశ్విన్ శరవణన్‌తో సమంత ఓ హర్రర్ చిత్రంలో నటించేందుకు ఒప్పుకుంది. ఆమె చివరిసారిగా ది ఫ్యామిలీ మ్యాన్ రెండవ సీజన్‌లో కనిపించింది.
This is so beautiful @iamnagarjuna mama 🥺🙏🤗❤️ #ANRLivesOn https://t.co/Xt6XQ6rhNu
— S (@Samanthaprabhu2) September 20, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com