Samantha : ముందు అలా.. ఇప్పుడు ఇలా.. ఏంటీ సామ్ ఇది..!

Samantha : ముందు అలా.. ఇప్పుడు ఇలా.. ఏంటీ సామ్ ఇది..!
నిన్న(సెప్టెంబర్ 20) అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా నాకు చాలా స్పెషల్ డే.. నా హీరో, నా ప్రేరణ నాన్న గారి పుట్టినరోజు అంటూ ట్విట్టర్‌లో ఓ వీడియోని పోస్ట్ చేశారు నాగార్జున..

గతకొద్దిరోజులుగా టాలీవుడ్‌‌లో హాట్‌‌‌టాపిక్‌‌గా మారింది సమంత- నాగ చైతన్య విడాకుల ఇష్యూ. ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని త్వరలో వారు విడాకులు తీసుకోబోతున్నరంటూ వార్తలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. అయితే ఈ వార్తల పైన అటు సమంత కానీ ఇటు నాగచైతన్య కానీ స్పందించకపోవడంతో ఇష్యూ ఇంక పెద్దదవుతుంది.

దీనికి తోడు రీసెంట్‌‌గా తిరుమలకి వచ్చిన సమంతకి.. ఓ రిపోర్టర్ నుంచి ఇదే ప్రశ్న ఎదురవ్వడం, దానికి ఆమె " నేను వచ్చింది గుడికి .. ఇవేం ప్రశ్నలు బుద్దుందా" అంటూ అతని పై సీరియస్ అవ్వడం, సమంత .. తన ఇన్‌‌స్టా లో పెట్టె పోస్టులు కూడా పలు అనుమానాలకి తావిస్తున్నాయి. దీనితో అక్కినేని అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అన్న కొత్త సందేహాలకు తెరలేపుతున్నాయి.

ఇదిలావుండగా తాజాగా సమంత చేసిన ఓ పోస్ట్ అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. నిన్న(సెప్టెంబర్ 20) అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా నాకు చాలా స్పెషల్ డే.. నా హీరో, నా ప్రేరణ నాన్న గారి పుట్టినరోజు అంటూ ట్విట్టర్‌లో ఓ వీడియోని పోస్ట్ చేశారు నాగార్జున.. దీనిపైన స్పందించిన సమంత.. దాన్ని రీ ట్వీట్ చేస్తూ 'ఇది చాలా బాగుంది' అంటూ క్యాప్షన్ పెట్టింది.

ఎప్పుడు నాగార్జునని మామ అంటూ ముద్దుగా పిలిచే సామ్... ఈ సారి ఎందుకో ఏకవచనంతో పిలిచేసింది. ఆ తర్వాత దాన్ని డిలిట్ చేసి 'ఇది చాలా బాగుంది నాగార్జున మామ' అంటూ మరో ట్వీట్ చేసింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారాయి. వాస్తవానికి నాగార్జునని ఎక్కడైనా మామ అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుస్తుంది సామ్.

నాగార్జున కూడా అంతే ప్రేమతో కోడలుపిల్ల అంటూ నవ్వుతూ సంభోదిస్తారు. కానీ ఈసారి సామ్.. నాగార్జునని ఏకవచనంతో పిలవడం అటు అభిమానులకి, ఇటు తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదు. ముందు అలా.. ఇప్పుడు ఇలా ఏంటీ సామ్ ఇదంతా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Tags

Read MoreRead Less
Next Story