లవ్‌స్టొరీ ట్వీట్స్‌తో విడాకుల రూమర్స్‌కి చెక్ పెట్టిన చైతూ,సామ్ .. !

టాలీవుడ్‌లో ఇప్పుడేమైన హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే ఆది నాగచైతన్య, సమంతల డివోర్స్.. త్వరలో ఇద్దరూ విడాకులు తీసుకుంటారంటూ గత కొద్దిరోజులుగా న్యూస్ చక్కర్లు చక్కర్లు కొడుతుంది. అయితే దీనిపైన ఇటూ చైతూ కానీ అటు సమంత కానీ స్పందించింది లేదు. కానీ ట్వీట్స్‌తో ఆ వార్తలకి చెక్ పెట్టినట్లుగా అనిపిస్తుంది. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా లవ్‌స్టోరీ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని చిత్ర యూనిట్ నిన్న విడుదల చేసింది. చైతన్య ట్వీట్‌ని రీట్వీట్ చేసిన సమంత.. సాయిపల్లవికి అల్ ది బెస్ట్ చెప్పింది.. దీనికి చైతూ స్పందిస్తూ.. థాంక్స్ సామ్ అంటూ రిప్లయ్ ఇచ్చాడు. దీనితో వీరి విడాకుల మాట పుకార్లేనని అభిమానులు చర్చించుకుంటున్నారు. కాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్‌స్టొరీ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా పైన మంచి అంచనాలున్నాయి.
Thanks Sam !! https://t.co/XDI4gAOjmR
— chaitanya akkineni (@chay_akkineni) September 14, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com