టాలీవుడ్

Samantha : నేను ఎప్పటికి వదలను.. రూమర్స్ పై సామ్..!

టాలీవుడ్ లో సెలబ్రిటీ లపై రోజుకో రూమర్స్ పుట్టుకురావడం అనేది కామన్.. అందులో భాగంగానే ఇటీవల అక్కినేని సమంత.. నాగచైతన్య విడాకుల పై ఓ రూమర్ సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది..

Samantha : నేను ఎప్పటికి వదలను.. రూమర్స్ పై సామ్..!
X

టాలీవుడ్ లో సెలబ్రిటీ లపై రోజుకో రూమర్స్ పుట్టుకురావడం అనేది కామన్.. అందులో భాగంగానే ఇటీవల అక్కినేని సమంత.. నాగచైతన్య విడాకుల పై ఓ రూమర్ సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది.. దీనికితోడు సమంత ముంబైలో ఓ ఇల్లు తీసుకోబోతుందని.. హైదరాబాద్ ని వదిలి అక్కడే సెటిల్ అవుతుందని వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.. అయితే ఈ రూమర్స్ పైన సమంత ఇప్పటివరకు స్పందించకపోవడంతో ఈ టాపిక్ మరింత హాట్ ఇష్యూగా మారింది. అయితే తాజాగా సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన సామ్.. ఈ రూమర్స్ కి చెక్ పెట్టింది.

'సామ్‌ మీరు ముంబైకి షిప్ట్‌ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమేనా' అని ఓ అభిమాని ప్రశ్నించగా దీనిపైన ఆమె స్పందిస్తూ.. హైదరాబాదుని వదిలేసి ఎక్కడికి వెళ్ళడం లేదని, హైదరాబాదు నా హోం టౌన్ అని చెప్పుకొచ్చింది సమంత.. అంతేకాకుండా ఈ రూమర్స్ ఎలా పుట్టుకోస్తున్నాయో నాకు అర్ధం కావడం లేదని, ఇలా వచ్చిన రూమర్స్ లో ఒక్కటి కూడా నిజం లేదని చెప్పుకొచ్చింది సామ్.. కాగా ప్రస్తుతం శాకుంతలం అనే సినిమాలో ఆమె నటిస్తోంది.

Next Story

RELATED STORIES