టాలీవుడ్

Liger Poster: లైగర్ న్యూడ్ పోస్టర్‌.. సమంత, అనుష్క రియాక్షన్ ఏంటంటే..?

Liger Poster: పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘లైగర్’లో విజయ్.. ఓ బాక్సర్ పాత్రలో కనిపించనున్నాడు.

Liger Poster: లైగర్ న్యూడ్ పోస్టర్‌.. సమంత, అనుష్క రియాక్షన్ ఏంటంటే..?
X

Liger Poster: పాన్ ఇండియా స్థాయిలో సినిమాను తెరకెక్కించాలంటే.. అది అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉండాలి. దానికోసం దర్శకుడు ఎన్నో ప్రయత్నాలు, ప్రయోగాలు చేయాల్సి వస్తుంది. తాజాగా పూరీ జగన్నాధ్ కూడా లైగర్ కోసం అలాంటి ప్రయోగాలే చేస్తున్నాడు. ఇటీవల విడుదలయిన పోస్టరే దీనికి ఆధారం. ఈ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ న్యూడ్‌గా కనిపించి అందరికీ షాకిచ్చాడు. ఇక ఈ పోస్టర్‌పై సినీ సెలబ్రిటీలు సైతం స్పందిస్తున్నారు.

పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న 'లైగర్'లో విజయ్.. ఓ బాక్సర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ గ్లింప్స్ విడుదలయ్యి అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఓ న్యూడ్ పోస్టర్‌తో సర్‌ప్రైజ్ చేసింది లైగర్ టీమ్. 'బ్రేక్ చేయడం కోసమే అతడు రూల్స్ గురించి తెలుసుకున్నాడు.' అంటూ లైగర్ పోస్టర్‌ను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది సమంత.


ఇక సోషల్ మీడియాకు దూరంగా ఉండే అనుష్క కూడా లైగర్ పోస్టర్‌ను పోస్ట్ చేసింది. 'లైగర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్. ఆ సినిమా ప్రతీ ఒక్కరికి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ మ్యాజిక్‌ను చూడడం కోసం ఎదురుచూస్తున్నాను పూరీ జగన్నాధ్ గారు. నీతో నువ్వే పోరాడుతూ, గెలుస్తూ ఉంటావు విజయ్.. నీకు కూడా బెస్ట్ మాత్రమే దక్కాలి. నువ్వు ఇంకా ఎన్నో కథలను చెప్పాలి చార్మీ. మంచి కథలను చెప్పడం కోసం ప్రతీసారి సాయం చేస్తున్నందుకు కరణ్ జోహార్‌కు థాంక్యూ. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరికి అభినందనలు' అని క్యాప్షన్ పెట్టింది అనుష్క.


Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES