Samantha: ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సమంత సంపాదన అన్ని కోట్లా..?

Samantha: ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సమంత సంపాదన అన్ని కోట్లా..?
Samantha: ఈ యాంగిల్‌లో చూస్తే సమంత.. సినిమాలకంటే ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే ఎక్కువగా సంపాదిస్తోంది

Samantha: అటు సౌత్, ఇటు నార్త్‌లో ఫుల్ బిజీగా గడిపేస్తున్న హీరోయిన్స్‌లో సమంత కూడా ఒకరు. ప్రస్తుతం సమంత పాపులారిటీని, క్రేజ్‌ను ఎవరూ టచ్ చేయని రేంజ్‌కు ఎదిగిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటూ తన ఫోటోషూట్స్‌తో అందరినీ షాక్‌కు గురిచేస్తోంది సామ్. అందుకే అసలు సమంత తన ఇన్‌స్టా పోస్టుల ద్వారా ఎంత సంపాదిస్తుంది అన్న సందేహం మొదలయ్యింది.


సమంత చేస్తున్న సినిమాలకంటే తన ఫోటోషూట్స్‌తో పాపులర్ అవుతున్నాయి. సమంత ఏం పోస్ట్ పెట్టిందా.. ఏం స్టోరీ పెట్టిందా.. అని ఆసక్తిగా ఎదురుచూసే నెటిజన్లు చాలామందే ఉన్నారు. ఇక తాజాగా ఏకంగా బికినీతో ఫోటోషూట్ చేసి షాకిచ్చింది సమంత. సామ్ గ్లామర్ డోస్ పెంచిందని ఓపెన్‌గానే నెగిటివ్ కామెంట్స్ వస్తున్నా.. తాను అవేవి పట్టించుకోను అంటోంది.


సమంత కేవలం తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులతోనే నెలకు దాదాపు రూ.3 కోట్లు సంపాదిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న సౌత్ సెలబ్రిటీల్లో ఈ రేంజ్‌లో ఇన్‌స్టా పోస్టుల ద్వారా వెనకేస్తుంది సమంత మాత్రమే. ఇక తాజాగా జరిగిన బికినీ ఫోటోషూట్ కోసం సమంత ఏకంగా రూ. 90 లక్షలు ఛార్జ్ చేసిందని టాక్. ఈ యాంగిల్‌లో చూస్తే సమంత.. సినిమాలకంటే ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే ఎక్కువగా సంపాదిస్తోంది అంటున్నారు అభిమానులు.

Tags

Read MoreRead Less
Next Story