Samantha case : ఎక్కడ కూడా సమంత డబ్బులు అడగలేదు : యలమంజుల బాలాజీ

Samantha case : ఎక్కడ కూడా సమంత డబ్బులు అడగలేదు : యలమంజుల బాలాజీ
X
Samantha case : సమంత ప్రతిష్టను దెబ్బతీసిన మూడు యూట్యూబ్‌ ఛానల్స్‌పై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరినట్లు సమంత తరపు న్యాయవాది యలమంజుల బాలాజీ తెలిపారు.

Samantha case : సమంత ప్రతిష్టను దెబ్బతీసిన మూడు యూట్యూబ్‌ ఛానల్స్‌పై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరినట్లు సమంత తరపు న్యాయవాది యలమంజుల బాలాజీ తెలిపారు. సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తిపై ఇలా ఆరోపణలు చేస్తూ ప్రసారాలు చేయడం సరైంది కాదన్నారు. తమ పిటిషన్‌లో ఎక్కడ కూడా సమంత డబ్బులు అడగలేదని... యూట్యూబ్‌ లింకులు మాత్రమే తొలగించాలని కోరామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి వార్తలు రాయకుండా.. పర్మినెంట్‌ ఇంజంక్షన్‌ ఆర్డర్‌ ఇవ్వాలని కోరామని అడ్వకేట్‌ యలమంజుల బాలాజీ తెలిపారు.

Tags

Next Story