లవ్‌స్టోరి ట్రైలర్ పై సామ్ రియాక్షన్.. మళ్ళీ కొత్త డిబేట్ షురూ

Samantha : స్టార్ కపుల్స్ లలో ఒకరైన అక్కనేని నాగచైతన్య, సమంత త్వరలో విడాకులు తీసుకుంటారంటూ గత కొద్దిరోజులుగా న్యూస్ చక్కర్లు కొడతున్న సంగతి తెలిసిందే... అయితే దీనిపైన ఇటూ చైతూ కానీ అటు సమంత కానీ స్పందించింది లేదు. ఇదిలావుండగా సామ్ చేసిన ఓ కొత్త పోస్ట్ ఇప్పుడు మరోకొత్త డిబేట్ కు దారి తీసింది. ఇంతకు అది ఏంటంటే.. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా లవ్‌స్టోరి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని చిత్ర యూనిట్ ఈ రోజు విడుదల చేసింది. చైతన్య ట్వీట్ ని రీట్వీట్ చేసిన సమంత సాయిపల్లవికి అల్ ది బెస్ట్ చెప్పింది కానీ చైతన్య గురించి చెప్పలేదు. దీనితో ఇలా ఎందుకు చేశావ్ సామ్ అంటూ ఫ్యాన్స్ ఆమెను ట్విట్టర్ లో ప్రశ్నిస్తున్నారు. కాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ స్టొరీ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
WINNER!!
— S (@Samanthaprabhu2) September 13, 2021
All the very best to the team @Sai_Pallavi92 🤗.. #LoveStoryTrailer https://t.co/nt9rzTc3lY
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com