Samantha Ruth Prabhu: ఎన్‌టీఆర్ సినిమాను వద్దనుకున్న సమంత.. అదే కారణం..?

Samantha Ruth Prabhu: ప్రస్తుతం తెలుగులోనే కాదు తమిళ, హిందీ భాషల్లో కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది సమంత. తను నటిస్తుందంటే చాలు.. ఆ సినిమాపై ప్రేక్షకుల్లో ఆటోమేటిక్‌గా అంచనాలు పెరిగిపోతున్నాయి. అందుకే మేకర్స్ కూడా ఓవైపు లేడీ ఓరియెంటెడ్ కథలను తనకు వినిపిస్తూనే.. మరోవైపు కమర్షియల్ చిత్రాలకు తనను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎన్‌టీఆర్‌తో నటించే అవకాశాన్ని మాత్రం సమంత వదిలేసుకుందని సమాచారం.
ఎన్‌టీఆర్, సమంత.. ఆన్ స్క్రీన్ క్యూట్ కపుల్స్‌లో వీరు కూడా ఒకరు. ఇప్పటివరకు వీరిద్దరూ మూడు చిత్రాల్లో కలిసి నటించగా.. అందులో రెండు సినిమాలు సూపర్ హిట్ టాక్ అందుకున్నాయి. అంతే కాకుండా వీరిద్దరి కెమిస్ట్రీకి కూడా మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఎన్‌టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'ఎన్‌టీఆర్ 30'లో హీరోయిన్‌గా సమంత చేస్తే బాగుంటుందని అనుకున్నారట మేకర్స్.
ఇప్పటికే ఎన్‌టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో 'జనతా గ్యారేజ్' చిత్రం వచ్చి హిట్ అందుకుంది. అందులో కూడా హీరోయిన్‌గా సమంతనే నటించింది. అందుకే ఎన్‌టీఆర్ 30 కోసం సమంతను సంప్రదించాడట కొరటాల. కానీ సమంత ఆ సినిమాలో నటించడం కోసం రూ. 4 కోట్లు డిమాండ్ చేసిందట. ఇప్పటివరకు ఒక్కో మూవీకి రూ.2 కోట్లు తీసుకునే సమంత.. ఏకంగా తన పారితోషికాన్ని రూ.3.5 నుండి 4 కోట్లు పెంచేసి అందరికీ షాకిస్తోంది. అయితే కొరటాల మాత్రం తన బడ్జెట్‌లో హీరోయిన్‌కు రూ.2.5 కోట్లు మాత్రమే కేటాయించాలని నిర్ణయించాడట. అలా రెమ్యునరేషన్ కారణంగా సమంత.. ఎన్‌టీఆర్ 30లో భాగం అవ్వలేకపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com