Samantha Ruth Prabhu: సోషల్ మీడియా నుండి సమంత మాయం.. చివరి పోస్ట్ అప్పుడే..

Samantha Ruth Prabhu: సోషల్ మీడియా నుండి సమంత మాయం.. చివరి పోస్ట్ అప్పుడే..
X
Samantha Ruth Prabhu: ఫోటోషూట్స్, యాడ్స్.. ఇలా ఏదో ఒక విధంగా తన గురించి సోషల్ మీడియాలో అప్డేట్ ఇస్తూనే ఉంటుంది సమంత.

Samantha Ruth Prabhu: సెలబ్రిటీలకు.. వారి అభిమానులను దగ్గర చేసేది సోషల్ మీడియా. ఎప్పటికప్పుడు వారి పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను షేర్ చేస్తూ.. సెలబ్రిటీలు తమ ఫ్యాన్స్‌ను సంతోషపెడుతుంటారు. అలా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండేవారిలో సమంత ఒకరు. కానీ ప్రస్తుతం సమంత సోషల్ మీడియాలో సైలెంట్ అయ్యింది. దీంతో ఫ్యాన్స్ అంతా ఆలోచనలో పడ్డారు.


ఫోటోషూట్స్, బ్రాండ్స్ ప్రమోషన్స్, యాడ్స్.. ఇలా ఏదో ఒక విధంగా తన గురించి సోషల్ మీడియాలో అప్డేట్ ఇస్తూనే ఉంటుంది సమంత. అంతే కాకుండా తన పెట్స్‌తో ఫోటోలు, తన వెకేషన్ అప్డేట్స్, జిమ్ వీడియోలు.. ఇలా ఎప్పటికప్పుడు అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటుంది. కానీ ప్రస్తుతం సమంత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి చాలా గంటలు అవుతోంది. సమంత చివరి పోస్ట్ జూన్ 30న అప్లోడ్ అయ్యింది.

ఇక తాజాగా సమంత ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ అయ్యిందని తన టీమ్ వ్యక్తి పోస్ట్ చేశాడు. ఆ తర్వాత సమంత నుండి ఒక్క పోస్ట్ కానీ, స్టోరీ కానీ లేదు. మామూలుగా తాను దిగే చాలావరకు ఫోటోలను సామ్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంది. కానీ ఈమధ్య ఫోటోషూట్స్ జరుగుతున్న కూడా తన సోషల్ మీడియాలో ఉలుకు, పలుకు లేదు. సడెన్‌గా తను ఇలా సైలెంట్ అయిపోవడానికి కారణమేంటో సమంతనే స్వయంగా చెప్పాలి.

Tags

Next Story