Samantha Ruth Prabhu: దాని వల్లే మొదట్లో బాధపడేదాన్ని: సమంత

Samantha Ruth Prabhu: సమంత రుత్ ప్రభు.. ప్రస్తుతం ఈ నటి ప్రొఫెషనల్ లైఫ్ మాత్రమే కాదు పర్సనల్ లైఫ్ కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తను పెట్టిన పోస్టుల దగ్గర నుండి తను చేస్తు్న్న సినిమాల వరకు ప్రేక్షకులు అన్నింటిని చాలా పరిశీలనతో చూస్తున్నారు. అందుకే తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి.
సమంత ప్రస్తుతం చేతినిండా సినిమాలతో, యాడ్స్‌తో చాలా బిజీగా గడిపేస్తోంది. కానీ తప్పకుండా తన అభిమానుల కోసం స్పెషల్ ఫోటోషూట్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. అలా ఇటీవల గ్లామర్ డోస్ పెంచి సమంత చేసిన ఫోటోషూట్స్ తెగ వైరల్ అయ్యాయి. కొందరు మాత్రం సమంత చాలా హాట్‌గా ఉంది అని ప్రశంసిస్తే.. చాలామంది మాత్రం ఏంటి ఈ పద్ధతి అని విమర్శించారు. ఇలాంటి నెగిటివ్ కామెంట్స్‌పై సమంత ఇటీవల స్పందించింది.
ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ వల్ల మొదట్లో తాను కూడా బాధపడేదాన్నని తెలిపింది సమంత. ఆ బాధ వల్లే అప్పుడప్పుడు తాను రాత్రులు నిద్రపోయేది కూడా కాదట. ఇక ఇప్పుడు తాను పూర్తిగా ట్రోల్స్‌ను పట్టించుకోవడం లేదని స్పష్టం చేసింది సామ్. అంతే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం తనకు ఇష్టమని తెలిపింది. మాటల్లో చెప్పలేని ఎన్నో విషయాలను ఫోటో ద్వారా చెప్పడం సాధ్యమవుతుందని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది సమంత.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com