Sandalwood: బాలీవుడ్ పై అవాక్కులు తగదు; అంతా ఒక్కటే: కేజీఎఫ్ హీరో

Sandalwood: బాలీవుడ్ పై అవాక్కులు తగదు; అంతా ఒక్కటే: కేజీఎఫ్ హీరో
మమ్మల్ని తక్కువ చేసినప్పుడు బాధపడ్డాం; కానీ, ఇంకొకరిని మాలా బాధపడనివ్వమంటోన్న యశ్. మరోసారి పెద్ద మనసు చాటుకున్న హీరో

Sandalwood: బాలీవుడ్ పై అవాక్కులు తగదు; అంతా ఒక్కటే: కేజీఎఫ్ హీరో


కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు యశ్. ఛాప్టర్ 1,2తో ప్రభంజనం సృష్టించిన ఈ కన్నడ హీరో కు దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలన్న సూత్రాన్ని మాత్రం తు.చ.తప్పకుండా ఫాలో అవుతున్న యశ్ మరిన్ని హృదయాలను గెలుచుకుంటున్నాడు.


రీసెంట్ గా మీడియాతో ఇంటరాక్ట్ అయిన యశ్ బాలీవుడ్ గురించి వస్తోన్న నెగెటివ్ టాక్ కు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు. గతంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి అద్భుతమైన సినిమాలు వచ్చేవని, అయితే ఆ సినిమాలకు పోటీగా సౌత్ సినిమాలు వచ్చినప్పటికీ ఎంతోమంది తమను ఎగతాళి చేసేవారని యశ్ గుర్తుచేశాడు. ఇక ఇప్పుడు ఆ పరిస్ధితుల మారాయని పేర్కొన్నారు.

ప్రస్తుతం దక్షిణాది నుంచి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయని, బాలీవుడ్ ప్రేక్షకులు సైతం సౌత్ సినిమాలను అర్థం చేసుకుంటున్నారని యష్ పేర్కొన్నాడు. దీనికి ఉదాహరణగా బాలీవుడ్ లో జరిగిన పలు ఇంటర్వ్యూలలో సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్ వంటి స్టార్స్ సైతం యష్ గొప్పతనం గూర్చి పలుమార్లు ప్రస్తావించడం కూడా మనం చూశాం. ఇక కన్నడ పరిశ్రమలో ఉన్న నటీనటులందరికీ మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నట్లు యష్ తెలిపాడు.


అయితే ఇప్పుడు గుర్తింపు వచ్చినంత మాత్రాన్న ఎవరినీ తక్కువ చేసి చూడకూడదని, అందరినీ గౌరవించాలని, అందులో భాగంగా బాలీవుడ్‌ని కూడా గౌరవించాలని హితవు పలికాడు. అన్నింటికంటే ముఖ్యంగా ఉత్తరాది సినిమాలు, దక్షిణాది సినిమాలు అనే తేడాను మర్చిపోవాలని, అందరం కలిసిమెలిసి ఉంటూ మంచి సినిమాలు తీసి భారతదేశ గొప్పతనం చాటాలని తెలిపాడు. ఏమైనా యశ్ మరోసారి భారతీయుల మది గెలిచాడనే చెప్పాలి.

Tags

Read MoreRead Less
Next Story