ఏడేళ్ల కుర్రాడికి ఎంత కోపం.. సోనూసూద్‌ని కొడుతున్నారని టీవీని పగలగొట్టి..

ఏడేళ్ల కుర్రాడికి ఎంత కోపం.. సోనూసూద్‌ని కొడుతున్నారని టీవీని పగలగొట్టి..
Sonu Sood: తన అభిమాన నటుడు సోనుసూద్‌ని ఓ చిత్రంలో హీరో కొడుతున్నాడు. అది చూసిన ఏడేళ్ల కుర్రాడు ఏ మాత్రం తట్టుకోలేకపోయాడు.

Sonu Sood: తన అభిమాన నటుడు సోనుసూద్‌ని ఓ చిత్రంలో హీరో కొడుతున్నాడు. అది చూసిన ఏడేళ్ల కుర్రాడు ఏ మాత్రం తట్టుకోలేకపోయాడు. వెంటనే వెళ్లి టీవీని పగలగొట్టేశాడు తెలంగాణలోని సంగారెడ్డికి చెందిన ఏడు సంవత్సరాల విద్యార్థి విరాట్.

సినిమాల్లో విలన్‌గా సినిమాలు చూసే వారికి మాత్రమే తెలిసిన నటుడు. కానీ కోవిడ్ సీజన్‌లో సోనూసూద్ అందరికీ తెలిసిపోయాడు. దేశంలోని మారు మూల ప్రాంతం వారికి కూడా సోనూ అంటే ఓ రియల్ హీరో. అభిమాన నటుడికి ప్రతి ఒక్కరు తమ గుండెల్లో అతడికి గుడి కట్టారు. అడిగిన వారికి లేదనకుండా సాయం అందించారు. ఆపన్నులు కష్టం వస్తే సోనూ వైపే చూశారు. అది ఆ ఏడేళ్ల పిల్లాడికి కూడా బాగా అర్థమైంది. అందుకే హీరో విలన్‌గా నటించిన సోనూ సూద్‌ని చితక్కొడుతుంటే తట్టుకోలేకపోయాడు. కోపంతో ఊగి పోయాడు. టీవీని పగలగొట్టేశాడు.

నటుడు సోను సూద్ తన కెరీర్‌లో నటించిన ప్రతి చిత్రంలోనూ దాదాపు విలన్ పాత్రలనే పోషించాడు. కానీ నిజ జీవితంలో అతడిని హీరోగా చూసి తెరపై విలనిజాన్ని ప్రదర్శించడం చూసి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

సోనూసూద్‌ను తెరపై కూడా హీరోగానే చూడాలని ఆ పిల్లవాడు కోరుకున్నాడు. మహమ్మారి సమయంలో లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన తరువాత సినిమాల్లో విలన్‌గా ఎందుకు చిత్రీకరిస్తున్నారని తండ్రిని ప్రశ్నించాడు. తండ్రి అతడికి అది సినిమా అని వివరించే లోపే వెళ్లి టీవీని పగలగొట్టాడు. దాంతో ఈ వార్త న్యూస్ ఛానెల్స్‌లో ముఖ్యాంశంగా మారింది.

తరువాత, ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియో క్లిప్‌ని చూసిన సోనూ సూద్ సరదాగా స్పందించారు.. అరే బేటా.. మీ టీవీలను పగలగొట్టవద్దు. మీ నాన్న వచ్చి తనకు ఇప్పుడు కొత్తటీవీ కొనిపెట్టమని నన్ను అడుగుతారేమో" అని సమాధానం ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story