Sankranthi Box office: వేడెక్కుతోన్న సంక్రాంతి.. ఈ సారి.. విన్నర్ ఎవరో.....

Sankranthi Box office: వేడెక్కుతోన్న సంక్రాంతి.. ఈ సారి.. విన్నర్ ఎవరో.....
సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ వార్; వాల్తేర్ వీరయ్య, వీర సింహా రెడ్డివైపే అందరి చూపు; మేమూ వచ్చేస్తున్నామంటూ క్యూ కడుతున్న అజిత్, విజయ్, శోభన్.....సంక్రాంతి.. తెలుగువారికి అత్యంత ఇష్టమైన పండగ. అందమైన రంగవల్లులు, తీర్చిదిద్దే ఇళ్లు, కోడి పందాలు, కొత్తల్లుళ్లు కోరికలు, కొంటె మరదళ్ల సరసాలతో ఊరంతా సందడిగా కనిపిస్తుంది. ఆ సందడిని మరింత ఆనందంగా మార్చేది తెలుగు సినిమా. యస్.. సంక్రాంతి అంటే మనవారికి సినిమా కూడా. ఈ కారణంగానే ఈ పండగ టైమ్ లో భారీ పోటీ ఉంటుంది. పందెం కోళ్లలా బాక్సాఫీస్ బరిలో తలపడే హీరోల మధ్య అభిమానుల హడావిడీ, హంగామాలతో థియేటర్స్ అన్నీ కూడా పండగ కళను సంతరించుకుంటాయి. అయితే ఈ మధ్య కాలంలో లేని విధంగా ఈ సారి సంక్రాంతి బాగా హీటెక్కింది. టాప్ స్టార్స్ మూవీస్ తో ఫుల్ ప్యాక్డ్ గా మారింది. పండగ జోష్ ను క్యాష్‌ చేసుకునేందుకు ఎవ్వరూ తగ్గేదే లే అంటూ దూసుకువస్తున్నారు. మరి ఈ పండగను వేడెక్కించిన ఆ సినిమాలేంటీ.. ఎప్పుడు వస్తున్నాయో చూద్దాం.దసరా కంటే సంక్రాంతికి కనిపించే స్టార్ వార్ చాలా పెద్దది. సమ్మర్ కంటే కూడా ఎక్కువగా సంక్రాంతిపైనే నమ్మకం పెట్టుకుంటారు మన స్టార్స్. ఎందుకంటే సంక్రాంతి అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ మొత్తం థియేటర్స్ కు వస్తుంది. దీంతో ఫస్ట్ డే, ఫస్ట్ వీకెండ్ రికార్డ్స్ కు ఆస్కారం ఉంటుంది. పైగా రెండు మూడు రోజుల్లోనే కంటెంట్ బావుంటే బ్రేక్ ఈవెన్ అయిపోవచ్చు. అలాగే లాస్ లు కూడా తక్కువే ఉంటాయి.


అందుకే ఇప్పటికే 1985 నుంచి 2017 వరకూ బాక్సాఫీస్ యుద్ధంలో తలపడిని మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నట సింహం బాలయ్య మరోసారి ఫెస్టివ్ వార్ కు రెడీ అయ్యారు. వీరిలో బాలయ్య సినిమా 'వీర సింహారెడ్డి' ఈ 12న విడుదల కాబోతోంది. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఇప్పటిక సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత మరిన్ని అంచనాలు పెరుగుతాయి.


'వీర సింహారెడ్డి' తర్వాత 13న చిరంజీవి 'వాల్తేర్ వీరయ్య' వస్తోంది. ఇందులోనూ శ్రుతి హాసన్ హీరోయిన్. బాబీ దర్శకుడు. రవితేజ ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రంపైనా భారీ అంచనాలున్నాయి. చిరంజీవి అయితే ఈ సంక్రాంతి తనదే అన్నట్టుగానే ముందుగానే సంబరాలు మొదలుపెట్టాడు. అయితే ఈ చిత్రాన్ని కూడా మైత్రీ మూవీస్ బ్యానరే నిర్మించింది. ముందుగా వీరు ఈ క్లాష్ ను తప్పించే ప్రయత్నం చేశారు. కానీ హీరోలు వినలేదు. సంక్రాంతికి రావాల్సిందే అని పట్టుబట్టారు. దీంతో తమకు ఇబ్బంది అని తెలిసినా నిర్మాతలు వెనక్కి తగ్గక తప్పలేదు.


ఇక వీరితో పాటు కోలీవుడ్ లో టాప్ స్టార్స్ గా ఉన్న విజయ్, అజిత్ లు కూడా సంక్రాంతి వేదికగా తెలుగు మార్కెట్ ను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇద్దరూ జనవరి 11నే వస్తుండటం విశేషం. ఈ రెండు సినిమాల ట్రైలర్స్ చూసిన తర్వాత ఇద్దరూ తెలుగు సినిమాలకు పోటీ ఇవ్వడం అసాధ్యమే అని తేలిపోయింది. ముఖ్యంగా అజిత్ సినిమా ట్రైలర్ విజయ్ 'బీస్ట్' ను తలపించింది. అతనితో ఇంతకు ముందు రెండు సినిమాలు చేసిన హెచ్ వినోద్ ఈ చిత్రానికి దర్శకుడు. విజయ్ సినిమాను నిర్మించింది దిల్ రాజు.. దర్శకుడు వంశీ పైడిపల్లి. ఇది విజయ్ కి ఫస్ట్ స్ట్రెయిట్ మూవీ అని చెప్పుకుంటున్నా.. విజయ్ అండ్ టీమ్ మాత్రం డబ్బింగ్ సినిమా అనే భావిస్తున్నారు.వీరితో పాటు చివరగా ఓ చిన్న సినిమా కళ్యాణం కమనీయం కూడా జనవరి 14న వచ్చే ప్రయత్నం చేస్తోంది. సంతోష్‌ శోభన్ హీరోగా నటించిన సినిమా ఇది. ఇద్దరు పెద్దవాళ్లు కొట్టుకుంటున్నప్పుడు చిన్న సినిమాకు ఆస్కారం ఉండదు. బట్ ఈ చిత్రాల కంటెంట్ వీక్ అయ్యి వీరి చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా పాస్ అయిపోతారు. కాకపోతే పోటీ మాత్రం ప్రధానంగా చిరంజీవి, బాలయ్యల మధ్యే ఉంది. అందుకే వీరు కూడా పోటా పోటీగా అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ వార్ లో సాలిడ్ విన్నర్ ఎవరో సంక్రాంతి తర్వాత తేలుతుంది.

Y.J. Rambabu

Entertainment Editor

Tags

Read MoreRead Less
Next Story