సారంగ దరియా సరికొత్త రికార్డు.. 100 మిలియన్ వ్యూస్

సారంగ దరియా సరికొత్త రికార్డు.. 100 మిలియన్ వ్యూస్
జానపద సాహిత్యం, సాయిపల్లవి స్టెప్పులు, మంగ్లీ వాయిస్ వెరసి సారంగదరియా పాట ఓ సంచలనం సృష్టించింది. ఎక్కడ చూసినా ఈ పాట హోరెత్తిపోతోంది.

జానపద సాహిత్యం, సాయిపల్లవి స్టెప్పులు, మంగ్లీ వాయిస్ వెరసి సారంగదరియా పాట ఓ సంచలనం సృష్టించింది. ఎక్కడ చూసినా ఈ పాట హోరెత్తిపోతోంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ అంటే ఇంక చెప్పేదేం ఉంటుంది. కుటుంబవిలువలకు ప్రాధాన్యం ఇస్తూ ఓ మంచి థీంతో కథను నడిపిస్తారు. ఆయన సినిమాలో హీరోయిన్‌గా రెండోసారి ఛాన్స్ కొట్టేసింది సాయిపల్లవి.. ఈసారి సారంగ దరియా అంటూ ప్రేక్షలను ఫిదా చేయనుంది.

అల్లు అర్జున్ అలవైకుంఠపురం బుట్టబొమ్మ పాటను కూడా వెనక్కు నెట్టి మరీ ముందు వరుసలో నిల్చుంది సారంగ దరియా. ఫిబ్రవరి 28న ఆదిత్య మ్యూజిక్ ఛానల్‌లో అప్‌లోడ్ అయిన సారంగ దరియా పాట తొలి రోజు నుంచే శ్రోతలను ఆకట్టుకుని మిలియన్ల కొద్దీ వ్యూస్‌ని సంపాదించి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ అందించిన ట్యూన్, సుద్ధాల అశోక్ తేజ అందించిన సాహిత్యం, ఉరికే ఉత్సాహంతో మంగ్లీ పాడిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. పాటకి అనుగుణంగా శేఖర్ మాస్టర్ డిజైన్ చేసిన స్టెప్పులను అవలీలగా చేసేసి డ్యాన్స్ కింగ్ అల్లు అర్జున్‌ని సైతం ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఆమె ఎనర్జీ సారంగ దరియా పాటకు అదనపు ఆకర్షణ అయిందనడంలో అతిశయోక్తి లేదు. కాగా, 'లవ్ స్టోరీ' చిత్రం ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags

Read MoreRead Less
Next Story