Sarkaru Vaari Paata OTT: ఓటీటీలో 'సర్కారు వారి పాట'.. డేట్ ఫిక్స్..

Sarkaru Vaari Paata OTT: ఒకప్పుడు థియేటర్లలో ఏదైనా సినిమా మిస్ అయితే.. అది టీవీల్లో ప్రసారం అయ్యేవరకు ఎదురుచూడాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఓటీటీ వల్ల అన్ని సినిమాను ఈజీగా చూసే అవకాశం వచ్చేసింది. అందుకే థియేటర్లలో సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు.. ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక మహేశ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న 'సర్కారు వారి పాట' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి ఓ అప్డేట్ బయటికొచ్చింది.
పరశురామ్ దర్శకత్వం వహించిన 'సర్కారు వారి పాట'.. చాలాకాలం తర్వాత మహేశ్ అభిమానులకు మాస్ ట్రీట్ ఇచ్చింది. అంతే కాకుండా కలెక్షన్ల విషయంలో కూడా ఎన్నో రికార్డులు సృష్టించింది. ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది సర్కారు వారి పాట. ఈ సినిమాకు మొదట నెగిటివ్ టాక్ వచ్చినా.. ప్రేక్షకులు వాటిని పట్టించుకోకుండా సినిమాను సూపర్ హిట్ చేశారు.
సర్కారు వారి పాట ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను అమేజాన్ ప్రైమ్ దక్కించుకుంది. అయితే ఈ సినిమా జూన్ 10 లేదా జూన్ 24న ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్టు సమాచారం. ఈ రెండు తేదీల్లో ఏదో ఒకదానిని త్వరలోనే ఖరారు చేసి ప్రేక్షకులకు సమాచారమివ్వనుంది మూవీ టీమ్. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సర్కారు వారి పాట.. ఓటీటీలో కూడా రికార్డులు క్రియేట్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com