Sarkaru Vaari Paata OTT: ఓటీటీలో 'సర్కారు వారి పాట'.. కానీ చూడాలంటే ఒక కండీషన్..

Sarkaru Vaari Paata OTT: ఓటీటీ అనేది పాపులర్ అయిన తర్వాత ఎంత పెద్ద సినిమా అయినా విడుదలయిన నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది. లేదా దాదాపు 50 రోజుల్లో అయినా మూవీలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అలాగే మహేశ్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట థియేటర్లలో విడుదలయ్యి మూడు వారాలే అయ్యింది. అయినా కూడా అప్పుడే అమెజాన్ ప్రైమ్‌లో విడులదవుతున్నట్టుగా ప్రైమ్ అఫీషిలయల్ ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.
మహేశ్, కీర్తి సురేశ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సర్కారు వారి పాట.. ముందుగా నెగిటివ్ టాక్‌తో ప్రారంభమయినా కూడా కలెక్షన్ల విషయంలో ఏ మాత్రం జోరు తగ్గలేదు. సర్కారు వారి పాటకు వస్తున్న నెగిటివ్ టాక్‌ను పట్టించుకోకుండా ఫ్యాన్స్ దానిని ఆదరించారు. అందుకే మహేశ్ నటించిన సూపర్ హిట్ సినిమాల లిస్ట్‌లో సర్కారు వారి పాట కూడా యాడ్ అయ్యింది. ఇంకా థియేటర్లలో సర్కారు వారి పాట సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుండగానే ఓటీటీలో విడుదలను ప్రకటించి షాక్ ఇచ్చింది.
ఈమధ్య కాలంలో ఏ హిట్ మూవీ అయినా ఓటీటీలో విడుదల అవుతుందంటే ముందుగా దానికి రెంట్ కట్టాల్సిందే. అంటే ఓటీటీలో కూడా ఫ్రీగా సినిమా చూడలేమని అర్థం. ఇలాంటి పే పర్ వ్యూ పద్ధతిని అమలు చేస్తున్నందుకు ఓటీటీలపై విమర్శలు వచ్చినా.. అవి మాత్రం వాటి పంతా మార్చడం లేదు. ఇప్పుడు సర్కారు వారి పాట కూడా అలాగే పే పర్ వ్యూతో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయ్యింది. ఇక కొన్నిరోజుల తర్వాత ప్రైమ్ యూజర్స్ అందరికీ ఫ్రీగా అందుబాటులోకి రానుంది ఈ చిత్రం.
the right mix of drama, action and comedy with a mind-blowing plot twist ✨#EarlyAccessOnPrime, Rent Now 🍿 pic.twitter.com/9n522fZtZu
— amazon prime video IN (@PrimeVideoIN) June 2, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com