మరోసారి సంక్రాంతినే టార్గెట్ చేసిన సూపర్ స్టార్!

మరోసారి సంక్రాంతినే టార్గెట్ చేసిన సూపర్ స్టార్!
గత ఏడాది(2020) సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. మరోసారి సంక్రాంతినే టార్గెట్ చేశాడు.

గత ఏడాది(2020) సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. మరోసారి సంక్రాంతినే టార్గెట్ చేశాడు. ప్రస్తుతం మహేశ్ బాబు.. గీతాగోవిందం ఫేమ్ పరుశురాం దర్శకత్వంలో చేస్తోన్న 'సర్కారు వారి పాట' సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ పోస్టర్ ను పోస్ట్ చేస్తూ.. 'సూపర్ స్టార్ సంక్రాంతికి మరోసారి' అని పోస్ట్ చేసింది.

ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తిసురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ బాబు 27 వ సినిమా వస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి.


Tags

Read MoreRead Less
Next Story