అప్పుడు 'మహానటి' సావిత్రి.. ఇప్పుడు 'దేవినేని' జమున.. ముఖ్యపాత్రలో

ప్రముఖుల బయోపిక్ తీయడం దర్శకులకు కత్తి మీద సాములాంటిదే. నాగ్ అశ్విన్ మహానటి సావిత్రి బయోపిక్ తెరకెక్కించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. అలనాటి అందాల తార అభినయాన్ని తెరపై మరోసారి చూసి ప్రేక్షకులు మురిసిపోయారు. సావిత్రిని మరిపించిన కీర్తి సురేష్ నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఇప్పుడు మరో నటి సావిత్రికి సరిజోడి.. జమున బయోపిక్‌ను తెరకెక్కించడానికి శివనాగు నర్రా ఈ కథకి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది.
జమునను సంప్రదించి కథ రెడీ చేసుకున్నారని సమాచారం. ఇక ఆమె పాత్రను చేయడానికి తమన్నా భాటియా నటించనున్నారట. జమున ఎన్టీఆర్, ఏఎన్నార్, క్రిష్ణ, శోభన్ బాబులతో కలిసి నటించారు. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన సమాచారం అధికారిక ప్రకటన ఏదీ బయటకు రానప్పటికీ, మరి కొద్ది రోజుల్లో రానుందని అంటున్నారు. ఆహా కోసం వెబ్ సిరీస్ చేసిన తమన్నా, సీటీమార్ సినిమాతో బిజీగా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com