Naresh: నటితో పెళ్లంటూ రూమర్స్.. ఇంతలోనే పెళ్లి వేస్ట్ అంటూ నరేష్ కామెంట్స్..

Naresh: నటితో పెళ్లంటూ రూమర్స్.. ఇంతలోనే పెళ్లి వేస్ట్ అంటూ నరేష్ కామెంట్స్..
Naresh: 'ఇటీవల ఫ్యామిలీ కోర్టులు ఎక్కువవుతున్నాయి. ప్రతి పది మంది జంటలలో ఐదుగురు విడిపోతున్నారు'

Naresh: పెళ్లి, విడాకులు, మళ్లీ పెళ్లి.. ఇలాంటివి ఎవరి జీవితంలో అయినా వ్యక్తిగత విషయాలే. కానీ సినిమావారి జీవితానికి సంబంధించి మాత్రం ఇవేవి వ్యక్తిగతం కాదు. వారి ప్రొఫెషనల్ విషయాలు మాత్రమే కాదు పర్సనల్ విషయాలు కూడా తెలుసుకోవడానికి ఇష్టపడే ప్రేక్షకులు ఉంటారు. అందుకే ప్రస్తుతం సీనియర్ హీరో నరేష్ పెళ్లి వార్త టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

సీనియర్ హీరో నరేష్.. ప్రస్తుతం తండ్రి పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నారు. చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. అయితే ఇదే సమయంలో తను.. నటి పవిత్ర లోకేష్‌తో సహజీవనం చేస్తున్నారని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ రూమర్స్ మధ్యలోనే నరేష్.. పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.


'ఇటీవల ఫ్యామిలీ కోర్టులు ఎక్కువవుతున్నాయి. ప్రతి పది మంది జంటలలో ఐదుగురు విడిపోతున్నారు. దీనికి కారణం ఇద్దరూ సమానమే అనే ఫీలింగ్. గతంలో భర్త సంపాదిస్తే భార్య ఇల్లు చక్కబెట్టుకునేది. ఇప్పుడు ఇద్దరూ సంపాదిస్తున్నారు. ఆమె సొంతంగా ఫోన్ కొనుక్కుంటోంది. ఆమెకి కూడా ఫ్రెండ్స్ ఉంటున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితి ఉండడం లేదు. ఫలితంగా విడిపోతున్నారు.' అని అన్నారు నరేష్.

రానున్న రోజుల్లో వివాహ వ్యవస్థే కనుమరుగవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు నరేష్. పెళ్లి చేసుకోవడమే వేస్ట్ అని అర్థం వచ్చేలా మాట్లాడారు. అయితే ఇలా విడిపోతున్న వారిలో సినిమావారు మాత్రమే లేరని సమర్థించారు. మరి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నరేష్.. పవిత్ర లోకేష్‌తో తన పెళ్లిపై మాత్రం ఎలాంటి స్పందన ఇవ్వలేదు.



Tags

Read MoreRead Less
Next Story