Balakrishna: బాలయ్య, అనిల్ రావిపూడి మూవీపై క్రేజీ అప్డేట్.. విలన్‌గా నటించనున్న స్టార్ హీరో..

Balakrishna: బాలయ్య, అనిల్ రావిపూడి మూవీపై క్రేజీ అప్డేట్.. విలన్‌గా నటించనున్న స్టార్ హీరో..
Balakrishna: ప్రస్తుతం బాలయ్య.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

Balakrishna: ఈమధ్యకాలంలో హీరోలు.. విలన్‌లుగా నటించడానికి కూడా వెనకాడడం లేదు. యాక్టర్‌గా గుర్తింపు పొందాలంటే హీరో పాత్రా? విలన్ పాత్రా? అని ఆలోచించకూడదని చాలామంది నటులు అనుకుంటున్నారు. యంగ్ హీరోలు సైతం విలన్‌లుగా మారుతుండగా వారిబాటలోనే సీనియర్ హీరోలు కూడా వెళ్తున్నారు. తాజాగా బాలకృష్ణ సినిమా కోసం ఓ స్టార్ హీరో.. విలన్ పాత్ర పోషించడానికి ఒప్పుకున్నట్టు సమాచారం.

ప్రస్తుతం బాలయ్య.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడితో ఓ మూవీ చేయనున్నాడు. ఇంకా గోపీచంద్‌తో చేసే చిత్ర షూటింగ్ పూర్తవ్వకముందే అనిల్.. ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉండనున్నారనే వార్త వైరల్‌గా మారింది. అనిల్ రావిపూడితో చేస్తున్న మూవీలో బాలకృష్ణ కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తుండగా.. భార్యగా ప్రియమణి కనిపించనుందని సమాచారం.

తాజాగా ఇందులో ఓ కీలక పాత్ర చేయడం కోసం సీనియర్ హీరో రాజశేఖర్‌ను ఒప్పించాడట అనిల్ రావిపూడి. ఇప్పటివరకు రాజశేఖర్ ఓ విలన్ పాత్ర చేయనున్నాడని టాక్ వినిపించినా.. ఇప్పుడు అది ఒక కామెడీ పాత్ర అని ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా మొదటిసారి ఈ సినిమా కోసం రాజశేఖర్ సొంతంగా డబ్బి్ంగ్ కూడా చెప్పనున్నాడని టాక్. మరి రాజశేఖర్ ఇందులో ఏ క్యారెక్టర్ చేయనున్నాడో తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు వేచిచూడాల్సిందే.



Tags

Read MoreRead Less
Next Story