Waltair Veerayya: చిరు, రవితేజ సినిమాలో 'ఖైదీ' హీరోయిన్.. ఇన్నేళ్ల తర్వాత..

Waltair Veerayya: చిరు, రవితేజ సినిమాలో ఖైదీ హీరోయిన్.. ఇన్నేళ్ల తర్వాత..
X
Waltair Veerayya: చిరంజీవి, రవితేజ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మెగా 154’ షూటింగ్ ఇటీవల ప్రారంభమయ్యింది.

Waltair Veerayya: ప్రస్తుతం సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్న సీనియర్ హీరోహీరోయిన్లు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది నటీనటులు సినిమాల్లో కీలక పాత్రలతో మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ లిస్ట్‌లోకి రోజురోజుకూ ఒక కొత్త పేరు యాడ్ అవుతోంది. తాజాగా మరో సీనియర్ హీరోయిన్ కూడా ఈ జాబితాలో చేరనుందని సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'మెగా 154' షూటింగ్ ఇటీవల ప్రారంభమయిన విషయం తెలిసిందే. దీనికి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ కూడా దాదాపు ఖరారైనట్టే. ఈ సందర్భంగా మూవీ టీమ్ ఓ స్పెషల్ వీడియోను కూడా విడుదల చేసింది. డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో రవితేజ గెస్ట్ రోల్ అని ముందు చెప్పినా.. ఈ మూవీ కథ గురించి మాత్రం పలు రకాల రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి.


ఈ మూవీలో రవితేజ తల్లి కోసం కష్టపడుతున్న సమయంలో చిరంజీవికి, రవితేజకు పరిచయం ఏర్పడుతుందని.. దాని వల్లే వారి బంధం బలపడుతుందని సమాచారం. అయితే ఇంటర్వెల్‌లో వచ్చే యాక్షన్ సీన్స్‌లోనే రవితేజ క్యారెక్టర్ రివీల్ అవుతుందట. అప్పటివరకు కేవలం చిరునే సినిమాను నడిపిస్తారని టాక్ వినిపిస్తోంది.

ఇక ఇందులో కీలకంగా నిలిచే తల్లి పాత్ర కోసం చిరు హీరోగా నటించిన 'ఖైదీ' చిత్రంలో ఓ హీరోయిన్‌గా నటించిన సుమలతను ఫైనల్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే సుమలత తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఒకట్రెండు సినిమాల్లో నటించగా.. ఇది మాత్రం తనకు పెద్దకు బ్రేక్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.



Tags

Next Story