Amardeep Chowdary: పెళ్లి పీటలెక్కనున్న హీరో, హీరోయిన్.. గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్..

Amardeep Chowdary: సహ నటులను ప్రేమించి పెళ్లి చేసుకునేవారి సంఖ్య సినిమాల్లోకంటే సీరియల్స్‌లోనే ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికీ ఎందరో తెలుగు బుల్లితెర నటీనటులు లవ్ మ్యారేజ్ చేసుకొని వారి జీవితాన్ని సంతోషంగా గడిపేస్తున్నారు. ఇటీవల మరో హీరో, హీరోయిన్ కూడా పెళ్లితో ఒక్కటవ్వబోతున్నారు. వారు ఈ విషయాన్ని సీక్రెట్‌గా దాచినా.. సోషల్ మీడియాలో వారి ఎంగేజ్‌మెంట్ వీడియో ఏదో ఒక విధంగా బయటికొచ్చింది.
మా టీవీలోని సీరియల్స్‌తో నటులుగా గుర్తింపు తెచ్చుకున్నారు అమర్‌దీప్, తేజస్విని. వీరిద్దరు కలిసి ఏ సీరియల్‌లో నటించకపోయినా.. ఒకే ఛానెల్‌లో పనిచేస్తున్నందు వల్ల పలు సందర్భాల్లో వీరు ఈవెంట్స్‌లో కలిసి కనిపించారు. కానీ వీరిద్దరు ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని మాత్రం ఎవరూ ఊహించి ఉండరు. అందుకే ఎంగేజ్‌మెంట్ ఫోటోలు చూసిన బుల్లితెర ప్రేక్షకులు షాకవుతున్నారు.
ప్రస్తుతం 'జానకి కలగనలేదు' సీరియల్‌లో హీరోగా నటిస్తున్న అమర్‌దీప్ ఆ సీరియల్ హీరోయిన్‌తోనే ప్రేమలో ఉన్నాడని కూడా వార్తలు వచ్చాయి. కానీ తేజస్విని నిశ్చితార్థం చేసుకోవడంతో అవన్నీ రూమర్సే అని తేలిపోయింది. బిగ్ బాస్ బ్యూటీ అరియానా.. వీరి ఎంగేజ్‌మెంట్‌కు హాజరయ్యింది. అంతే కాకుండా వీరి నిశ్చితార్థం వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ పెళ్లి వార్త బయటికొచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com