Chandan Kumar: షూటింగ్ సెట్‌లో వివాదం.. హీరోపై చేయి చేసుకున్న అసిస్టెంట్ డైరెక్టర్..

Chandan Kumar: మమూలుగా సినిమా సెట్ అంటేనే దాదాపు వందమందితో నిండిపోయి ఉంటుంది. అక్కడ అందరూ కలిసి ఒకేమాటపై పనిచేస్తేనే వారు ప్రేక్షకులకు ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వగలుగుతారు. అందుకే తరచుగా అలాంటి ప్రదేశాల్లో వివాదాలు జరుగుతూ ఉంటాయి. సినిమా సెట్లలోనే కాదు సీరియల్స్ సెట్స్‌లో కూడా ఇదే పరిస్థితి. తాజాగా ఓ తెలుగు సీరియల్ సెట్‌లో జరిగిన వివాదం బుల్లితెర సర్కి్ల్లో చర్చనీయాంశంగా మారింది.
తెలుగు సీరియల్స్‌లో ఎక్కువగా కన్నడ నటీనటుల హవా నడుస్తుంది. తెలుగులోని ఆర్టిస్టులను పక్కన పెట్టి మరీ.. కన్నడలో బిజీగా ఉన్న వారిని తీసుకొచ్చి ఇక్కడ సీరియల్స్‌లో యాక్ట్ చేయిస్తారు మేకర్స్. అలా కన్నడ నుండి 'సావిత్రమ్మ గారి అబ్బాయి' సీరియల్‌తో పరిచయమయ్యాడు చందన్ కుమార్. ప్రస్తుతం 'శ్రీమతి శ్రీనివాస్' అనే సీరియల్‌లో లీడ్ యాక్టర్‌గా చేస్తున్నాడు.
ఇటీవల శ్రీమతి శ్రీనివాస్ సీరియల్ సెట్‌లో హీరో చందన్ కుమార్‌కు, అసిస్టెంట్ డైరెక్టర్‌కు వివాదం మొదలయ్యింది. దీంతో అసిస్టెంట్ డైరెక్టర్‌పై మాటలతో విరుచుకుపడ్డాడు చందన్ కుమార్. చందన్ ప్రవర్తన సెట్స్‌లో ఎవరికీ నచ్చలేదు. అందుకే అందరూ తనతో వాదనకు దిగారు. ఇంతలోనే ఆగ్రహంతో ఊగిపోయిన అసిస్టెంట్ డైరెక్టర్.. చందన్ కుమార్‌పై చేయి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com