అమెజాన్ ప్రైమ్ లో "షాదీ ముబారక్"

అమెజాన్ ప్రైమ్ లో షాదీ ముబారక్
బుల్లితెర మెగాస్టార్ సాగర్ నాయుడు, దృశ్యా రఘునాథ్ జంటగా నటించిన కంప్లీట్ ఎంటర్ టైనర్ "షాదీ ముబారక్".

బుల్లితెర మెగాస్టార్ సాగర్ నాయుడు, దృశ్యా రఘునాథ్ జంటగా నటించిన కంప్లీట్ ఎంటర్ టైనర్ "షాదీ ముబారక్". థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. గురువారం నుంచి "షాదీ ముబారక్" చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో ఫిల్మ్ లవర్స్ చూడొచ్చు. తొలి చిత్రంతోనే దర్శకుడు పద్మశ్రీ ప్రతిభ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు "షాదీ ముబారక్" చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేశారు.

ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకు సున్నిపెంట మాధవ్ పాత్రలో సాగర్ నాయుడు, మ్యారేజ్ బ్యూరో నుంచి అతనికి పెళ్లి చేసే బాధ్యతను తీసుకున్న తుపాకుల సత్యభామ క్యారెక్టర్ లో దృశ్యా రఘునాథ్ చేసిన ఆన్ స్క్రీన్ సందడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. "షాదీ ముబారక్" చిత్రానికి థియేటర్ ను మించిన రెస్పాన్స్ అమెజాన్ ప్రైమ్ లో వస్తుందని చిత్ర బృందం ఆశిస్తోంది.

అదితి, ఝాన్సీ, హేమ, రాజశ్రీ నాయర్‌, ప్రియదర్శి రామ్‌, హేమంత్‌, శత్రు, భద్రమ్‌, మధునందన్‌, అజయ్‌ ఘోష్ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎడిటర్‌: మధు,, సంగీతం: సునీల్‌ కశ్యప్, కెమెరా శ్రీకాంత్‌ నారోజ్, నిర్మాతలు రాజు, శిరీష్, కథ, మాటలు, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: పద్మ శ్రీ.

Tags

Next Story