టాలీవుడ్

Shahid Kapoor on Samantha : షాహిద్‌‌ని లవ్‌‌లో పడేసిన సమంత..!

Shahid Kapoor on Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు బాలీవుడ్ హీరో షాహిద్‌ కపూర్‌..

Shahid Kapoor on Samantha  : షాహిద్‌‌ని లవ్‌‌లో పడేసిన సమంత..!
X

Shahid Kapoor on Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు బాలీవుడ్ హీరో షాహిద్‌ కపూర్‌.. సోమవారం ట్విటర్‌లో లైవ్‌ సెషన్‌ నిర్వహించి అభిమానులతో ముచ్చటించాడు ఈ హీరో.. ఈ సందర్భంగా తనకి అభిమానుల నుంచి ఎదురైన ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలో 'ది ఫ్యామిలీ మ్యాన్‌ 2' వెబ్‌ సిరీస్‌ గురించి ఓ అభిమాని అడిగాడు. దీనిపైన షాహిద్ మాట్లాడుతూ... ఈ వెబ్ సిరీస్ తనకి ఎంతో నచ్చిందని.. ముఖ్యంగా సమంత నటనకి ఫిదా అయ్యానని అన్నాడు. వెబ్ సిరీస్ చూస్తున్నంత సేపుతనతో, తన నటనతో ప్రేమలో పడిపోయానని అన్నాడు. ఇప్పుడు ఆమెతో నటించాలనే ఆసక్తి పెరిగిందని, ఆమెతో కలిసి ఓ సినిమా చేయడం నాకు కల అంటూ చెప్పుకొచ్చాడు. ఇక షాహిద్ విషయానికి వచ్చేసరికి.. జెర్సీ మూవీ రీమేక్‌ కంప్లీటై రిలిజ్‌‌కు సిద్దంగా ఉంది. డిసెంబర్ 31 విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు.

Next Story

RELATED STORIES