Shakuntalam: అసుర సోదరులు

Shakuntalam: అసుర సోదరులు
శాకుంతలంలో కాలనేమి వంశానికి చెందిన అసుర సోదరులుగా సుబ్బరాజు, హరీష్ ఉత్తమన్

తన కెరీర్ లో ఇప్పటివరకూ ఎన్నో పాత్రలు పోషించిన సుబ్బరాజు ఈసారి సరికొత్త అవతారంలో కనిపించబోతున్నాడు. శాకుంతలం సినిమాలో అసుర వంశమైన కాలనేమి పురుషుడిగా కనిపించబోతున్నాడు. ఇక అతడి సోదరుడిగా కోలీవుడ్ విలన్ హరీశ్ ఉత్తమన్ నటిస్తున్నాడు. అతిక్రోథనేమి, విక్రోధనేమి సోదురులుగా వీరిద్దరి లుక్స్ రిలీజ్ చేయగా ప్రస్తుతం అది కాస్తా వైరల్ గా మారింది. సుబ్బరాజు, హరీశ్ ఇరువురికీ అసుర గెటప్ అతికినట్లు సరిపోయిందనే చెప్పాలి. ముఖ్యంగా ఆ పాత్రల్లోకి వారు పరకాయ ప్రవేశం చేసిన తీరు ఆకట్టుకుంటుందని చిత్ర బృందం చెబుతోంది. మరి ఈ అసుర సోదరులు ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటారో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story