Mahasamudram Twitter Review : డీసెంట్ యాక్షన్.. సిద్ధార్థ్ కి ఫర్ఫెక్ట్ కం బ్యాక్... !
Mahasamudram Twitter Review : చేసిన మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో తనదైన ముద్ర వేశాడు దర్శకుడు అజయ్ భూపతి.. RX 100 చిత్రంతో సంచలనం సృష్టించిన ఈ దర్శకుడు ఇప్పుడు మహాసముద్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శర్వానంద్, సిద్ధార్థ్, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ మెయిన్ లీడ్ లో యాక్ట్ చేసిన ఈ సినిమా నేడు (అక్టోబర్ 14 శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్, ట్రైలర్ ఈ సినిమాపై మంచి అంచనాలు పెంచాయి.ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. దర్శకుడు అజయ్ భూపతి చెప్పినట్టుగానే చేతన్ భరద్వాజ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందని అభిప్రాయపడుతున్నారు. .
ఫస్టాఫ్ డీసెంట్ యాక్షన్ అని సెకండ్ హాఫ్ బాగుందని, ఇంటర్వెల్ ఫైట్ సినిమాకే హైలెట్ అంటున్నారు. సినిమా స్లో గా మొదలైన ఇంటర్వెల్ ఫైట్ తో అసలు కథ మొదలవుతుందని అంటున్నారు. ఇక హీరో సిద్ధార్థ కి పర్ఫెక్ట్ కం బ్యాక్ మూవీ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించగా, సుంకర రామబ్రహ్మం నిర్మాతగా వ్యవహరించారు. జగపతి బాబు, రావు రమేష్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com