తినేవాళ్లు.. నెత్తిమీద జుట్టంత ఉంటే... పండించేవాళ్లు.. మూతి మీద మీసమంత కూడా లేరు!

తినేవాళ్లు.. నెత్తిమీద జుట్టంత ఉంటే... పండించేవాళ్లు.. మూతి మీద మీసమంత కూడా లేరు!
విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న హీరోలలో శర్వానంద్ ఒకరు.

విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న హీరోలలో శర్వానంద్ ఒకరు. శతమానం భవతి సినిమాతో మంచి ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించుకున్న శర్వా.. మరో ఫ్యామిలీ సినిమాతో ముందుకు వస్తున్నాడు.

ప్రస్తుతం శర్వానంద్‌ హీరోగా 'శ్రీకారం' అనే సినిమా తెరకెక్కుతుంది. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. బి.కిశోర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మహాశివరాత్రి కానుకగా మార్చి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు చేతుల మీదిగా చిత్ర టీజర్‌ విడుదల అయింది.

యాబై ఆరు సెకండ్స్ ఉన్న చిత్ర టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 'ఒక హీరో తన కొడుకుని హీరోని చేస్తున్నాడు. ఒక డాక్టర్‌ తన కొడుకుని డాక్టర్‌ను చేస్తున్నాడు. ఒక ఇంజినీర్‌ తన కొడుకుని ఇంజినీర్‌ చేస్తున్నాడు. కానీ ఒక రైతు మాత్రం తన కొడుకుని రైతును చేయడం లేదు.. ఈ ఒక్కటి నాకు జవాబు లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. తినేవాళ్లు మన నెత్తిమీద జట్టంతా ఉంటే పండించేవాళ్లు మూతి మీద మీసమంత కూడా లేరు" అని శర్వా చెప్పే డైలాగ్స్ హత్తుకునేలా ఉన్నాయి.

ఆమని, రావురమేశ్‌, సాయికుమార్‌, మురళీశర్మ, నరేశ్‌, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జే.మేయర్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని 14రీల్స్‌ ప్లస్‌ సంస్థ నిర్మిస్తోంది.


Tags

Read MoreRead Less
Next Story