'శ్రీకారం'.. ట్రైలర్ వచ్చేసింది‌..!

శ్రీకారం.. ట్రైలర్ వచ్చేసింది‌..!
కొద్దిసేపటి క్రితమే యంగ్ హీరోలు నితిన్‌, నాని, వరుణ్‌ తేజ్‌ చేతుల మీదిగాచిత్ర ట్రైలర్ విడుదలైంది. రెండు నిమిషాల 10 సెకండ్స్ ఉన్న చిత్ర ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది.

శర్వానంద్, ప్రియాంక అరుళ్‌ మోహన్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం శ్రీకారం.. . 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా... కిషోర్ దర్శకత్వం వహించారు. అయితే కొద్దిసేపటి క్రితమే యంగ్ హీరోలు నితిన్‌, నాని, వరుణ్‌ తేజ్‌ చేతుల మీదిగాచిత్ర ట్రైలర్ విడుదలైంది. రెండు నిమిషాల 10 సెకండ్స్ ఉన్న చిత్ర ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. నగరంలో ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం చేసే యువకుడు.. ఓ గ్రామానికి వచ్చి వ్యవసాయం చేయడం.. వ్యవసాయం చేయడం వల్ల అతను ఎదురుకున్న పరిస్థితులు ఏంటి అన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.. చిత్ర ట్రైలర్ లో వ్యవసాయం గురించి శర్వానంద్‌ చెప్పే సంభాషణలు చాలా బాగున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా సినిమాని మార్చి 11న విడుదల చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story