Shiva Balaji Wife : 'మనుషులు అయితే ఇలా చేయరు'.. హేమ చేయి కొరకడం పై మధుమిత..!

Shiva Balaji Wife : ఎంతో రసవత్తరంగా సాగిన 'మా' ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పైన మంచు విష్ణు విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో పోలింగ్ వద్ద హీరో శివబాలాజీ చేయిని సీనియర్ నటి హేమ కొరికింది. ఇది పెద్ద చర్చకి దారి తీసింది. దీనిపైన హేమ వివరణ కూడా ఇచ్చింది. శివబాలాజీ చేయి అడ్డుగా పెట్టాడని, తప్పుకోమంటే తప్పుకోలేదని, అందుకే కోరికినట్టుగా హేమ చెప్పుకొచ్చింది.
తాజాగా దీనిపైన శివబాలాజీ భార్య మధుమిత స్పందించింది. ఇలాంటి పనులు మనుషులు మాత్రం చేయరు. ఇంతకన్నా దీనిపైన నేనేం చెప్పలేను అంటూ సమాధానం ఇచ్చింది. శివబాలాజీ గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మధుమిత.. ఆయన కష్టానికి, సేవకి తగ్గ ఫలితం దక్కిందని చెప్పుకొచ్చింది. ఈ ఎన్నికల్లో 'మా' కోశాధికారి (ట్రెజరర్)గా శివబాలాజీ పోటీ చేసి నాగినీడుపై విజయం సాధించారు.
కాగా హేమ కొరకడంతో శివబాలాజీ చేతిపై గాయం అయింది. ఇది సెప్టిక్ అవుతుందన్న భయంతో ఓటింగ్ అనంతరం నిమ్స్ కి వెళ్ళిన ఆయన.. టీటీ ఇంజెక్షన్ వేయించుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com