Kushi 2022: షూటింగ్‌లో విజయ్, సామ్‌కు గాయాలు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..
Kushi 2022: షూటింగ్ సమయంలో నటీనటులు గాయపడడం సహజం. కానీ అప్పుడప్పుడు అలాంటిది ఏమీ జరగకపోయినా.. కేవలం రూమర్సే ఫ్యాన్స్‌ను కలవరపెడతాయి. అలా కొన్నిరోజులుగా సమంత, విజయ్ దేవరకొండకు 'ఖుషి' మూవీ షూటింగ్‌లో గాయాలయ్యాయి అనే వార్త వైరల్‌గా మారింది. మెల్లగా ఈ విషయం ఆ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ కంటపడింది. దీంతో ట్విటర్ ద్వారా ఫ్యాన్స్‌కు ఓ క్లారిటీ ఇచ్చాడు శివ.
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్నారు అనగానే 'ఖుషి' సినిమాకు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. అంతే కాకుండా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండడం.. వెంటవెంటనే అప్డేట్స్ బయటికి రావడం కూడా ఫ్యాన్స్‌ను హ్యాపీ చేశాయి. తాజాగా కశ్మీర్‌లో మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది మూవీ టీమ్. ఇదే సమయంలో షూటింగ్‌లో విజయ్, సామ్‌కు గాయాలయ్యాయనే వార్త బయటికి వచ్చింది.
ఓవైపు వెంటవెంటనే షూటింగ్ జరుపుకుంటూ.. ఖుషి టీమ్ అంతా సంతోషంగా ఉన్నారు. మరోవైపు విజయ్, సామ్‌కు గాయాలు అని రూమర్స్ వస్తున్నాయి.. ఈ రెండింటిలో ఏది నమ్మాలో ఫ్యాన్స్‌కు అర్థం కాలేదు. అయితే ఈ వార్తను షేర్ చేస్తూ డైరెక్టర్ శివ నిర్వాణ 'ఫేక్ న్యూస్' అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్‌కు కాస్త ఊరట లభించింది.
Fake news pic.twitter.com/dbneXS8h5s
— Shiva Nirvana (@ShivaNirvana) May 24, 2022
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com