శ్రీలీల అభిమానులకు షాకింగ్ న్యూస్.. అలా చేస్తోంది..

ట్రెండింగ్ బ్యూటీ శ్రీలీల (sri leela) గత నాలుగైదు నెలలుగా ప్రతి నెలా ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమ్మడు తన నటన కంటే అద్భుతమైన డ్యాన్స్‌తోనే ఎక్కువ పాపులర్ అయింది. ప్రస్తుతం థియేటర్లలో ఆడుతున్న గుంటూరు కారంలో (guntur kaaram) తనదైన డ్యాన్స్‌తో సంచలనం సృష్టించింది. కుర్చీ మడిచి మహేష్ బాబుతో సందడి చేసింది. కానీ డ్యాన్స్ పరంగా శ్రీలీల అదరగొట్టేస్తోంది. గతేడాది భగవంత్ కేసరి మినహా మిగిలిన స్కంద, ఆదికేశవ, ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్ ఫ్లాప్ అయ్యాయి.
గుంటూరు కారం కూడా మిక్స్ డ్ టాక్ తో నడుస్తోంది. అయితే, సినిమా కలెక్షన్లు మాత్రం బాగానే వస్తున్నాయి. కానీ శ్రీలీల కథల ఎంపిక ఇలాగే ఉంటే అమ్మడి కెరీర్ డేంజర్ జోన్ లో(career danger zone) పడినట్టే. మంచి సినిమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు శ్రీలీల కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాలకు విరామం ఇచ్చి చదువుపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. శ్రీలీల ప్రస్తుతం మెడిసిన్ చదువుతోంది. దీంతో కొన్ని రోజులు చదువుపై దృష్టి పెట్టాలని ప్లాన్ చేస్తోందట.
ఇటీవల పరీక్షలు కూడా రాసినట్లు వార్తలు వచ్చాయి. విరామం తర్వాత స్క్రిప్టుల విషయంలో మరింత జాగ్రత్తగా పనిచేయాలని అమ్మడు భావిస్తోంది. తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలో నటించాలనుకుంటుందట. . లేదంటే... నో అని సూటిగా చెప్పాలని ఫిక్స్ అయిపోయనది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (power star pawan kalyan )‘ఉస్తాద్ భగత్ సింగ్’తో పాటు మరికొన్ని సినిమాలు ఉన్నాయి. మరి... శ్రీలీల ఇక నుంచి ఎలాంటి సినిమాలు చేస్తుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com