Siri Hanmanth: సిరికి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు: శ్రీహాన్

Siri Hanmanth: బిగ్ బాస్ రియాలిటీ షోకు ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా.. దానిని వదలకుండా ఫాలో అయ్యేవారు కూడా ఉంటారు. రోజూ బిగ్ బాస్ చూడడం కాలక్షేపంగా పెట్టుకునే ఫ్యాన్స్ కూడా ఉంటారు. అందుకే బిగ్ బాస్ రియాలిటీ షోకు చాలా ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ఇప్పటికీ అందులో చేసిన కంటెస్టెంట్స్ పర్సనల్ లైఫ్ గురించి ఫాలో అవుతున్నారు ప్రేక్షకులు.
బిగ్ బాస్ 5 తెలుగులో అందరికంటే ఎక్కువగా హైలెట్ అయ్యారు షణ్ముఖ్, సిరి హన్మంత్. వీరిద్దరూ ఫ్రెండ్స్ అంటూ హద్దులు దాటిన ప్రవర్తన చాలామంది ప్రేక్షకులకు నచ్చలేదు. అందుకే ఇద్దరూ టాప్ 5 వరకు వచ్చినా ట్రాఫీ గెలుచుకోలేకపోయారు. అందుకే బయటికి వచ్చిన తర్వాత కూడా వీరి పర్సనల్ లైఫ్ ఎలా ఉందని బిగ్ బాస్ ప్రేక్షకులు ఫాలో అవుతున్నారు. అదే క్రమంలో షణ్ముఖ్‌కు దీప్తితో బ్రేకప్ కూడా అయ్యింది.
షణ్ముఖ్ లాగానే సిరికి కూడా తన బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్‌తో బ్రేకప్ అవుతుంది అనుకున్నారంతా. కానీ అలా జరగలేదు. ఈ జంట ఇప్పటికీ సంతోషంగా కలిసుంది. బిగ్ బాస్‌లో వీరితో పాటు కంటెస్టెంట్‌గా ఉన్న యాంకర్ రవి.. ఇటీవల తన యూట్యూబ్ ఛానెల్ కోసం ఓ వీడియో చేశాడు. దానికోసం ప్రియా, ప్రియాంక సింగ్, సిరిని పిలిచాడు. తాజాగా ఈ వీడియోకు సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది.
ఈ ప్రోమోలో సిరి కోసం శ్రీహాన్ ఓ వీడియో పంపించాడు. 'సిరిని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. నాకిప్పటికీ పడుతూనే ఉంది. సిరి ఏదైనా సాధించాలనుకుంటే ఎలాంటి కష్టాలు వచ్చినా దేన్నీ పట్టించుకోదు. యాంకరింగ్ చేసుకుంటూ సీరియల్స్, సీరియల్స్ నుంచి సినిమాలు, సినిమాల నుంచి మొన్నటి బిగ్‌బాస్ వరకు మొత్తం తన కష్టమే. ఎవరి సపోర్ట్ తను తీసుకోలేదు. కానీ ఎంత మాట్లాడినా సిరిని అర్థం చేసుకోవడం మాత్రం కష్టం' అన్నాడు శ్రీహాన్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com