Shriya Saran : తల్లైన శ్రియ.. లాక్‌డౌన్ టైంలో పండంటి ఆడబిడ్డకి.. !
Shriya Saran : టాలీవుడ్ హీరోయిన్ అభిమానులకి సప్రైజ్ షాక్ ఇచ్చింది. గతేడాది తాను పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లుగా రివిల్ చేసింది. "2020 కరోనా సమయంలో ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ఆ ఏడాదంతా అందరూ క్వారంటైన్‌లో ఉండిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు.. కానీ మా జీవితంలో మాత్రం అద్భుతం జరిగింది. మా ఇంట్లోకి ఓ చిన్నారి వచ్చింది. ఆమె రాకతో మా ప్రపంచమే మారిపోయింది. ఈ చిన్నారిని ప్రసాదించినందుకు దేవుడికి ఎంతగానో రుణపడి ఉంటాము" అంటూ సోషల్ మీడియా వేదికగా శ్రియ పేర్కొంది.
కాగా 2018లో రష్యన్ క్రీడాకారుడు ఆండ్రీ కోషీవ్‌ను శ్రియ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ జంట ముంబైలో నివాసం ఉంటుంది. గతేడాది వెకేషన్ నిమిత్తం బోర్సిలోనాకు వెళ్లిన శ్రియ దంపతులు లాక్‌డౌన్ కారణంగా అక్కడే ఉండిపోయారు. అయితే దాదాపు ఏడాది పాటు శ్రియ తన ప్రెగ్నెన్సీ గురించి బయటపెట్టకుండా జాగ్రత్తపడింది. ఈ జంటకి పండంటి ఆడబిడ్డ పుట్టింది. ప్రస్తుతం శ్రియ తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR లో కీలక పాత్ర పోషిస్తోంది. సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com