Shruti Haasan: ఆ వ్యాధితో బాధపడుతున్న శృతి హాసన్.. వీడియోతో పాటు ఎమోషనల్ నోట్ షేర్..

Shruti Haasan: సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా కొనసాగాలంటే.. అందంగా కనిపించాలి, డైట్ మెయింటేయిన్ చేయాలి.. ఇలాంటివి ఎన్నో పాటించాలి. ఇలాంటి సమయంలోనే వారికి పలు ఆరోగ్య సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇటీవల శృతి హాసన్.. తాను ఎదుర్కుంటున్న ఆరోగ్య సమస్య గురించి బయటపెట్టింది. అంతే కాకుండా ఈ విషయం అందరితో పంచుకోవడం ఆనందంగా ఉందని కూడా అంటోంది.
శృతి హాసన్.. తన సోషల్ మీడియాలో ఓ వర్కవుట్ వీడియోను పోస్ట్ చేసింది. దాంతో పాటు తనకు ఉన్న ఆరోగ్య సమస్య గురించి చెప్పుకొచ్చింది. 'నాతో పాటు వర్కవుట్ చేయండి. నేను పీసీఓతో పాటు పలు ఘోరమైన హార్మోన్ సమస్యలను ఎదుర్కొంటున్నాను. బ్యాలెన్స్ సరిగా లేకపోవడం, మెటాబోలిక్ సమస్యలతో యుద్ధం చేయడం ఎంత కష్టమో ఆడవారికి తెలుసు' అంటూ తన క్యాప్షన్‌లో చెప్పుకొచ్చింది శృతి.
'దీనిని ఒక యుద్ధంలాగా కాకుండా నా శరీరం ఎదుర్కుంటున్న సహజ పరిణామంగా చూస్తున్నాను. అందుకే నేను నా శరీరానికి సరైనా ఆహారాన్ని, సరిపడా నిద్రను ఇచ్చి, నా వర్కవుట్‌ను ఎంజాయ్ చేస్తూ థాంక్యూ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఫిట్‌గా, సంతోషంగా ఉంటూ హ్యాపీ హార్మోన్స్‌ను పెరగనిద్దాం. ఇదంతా మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది' అంటూ పోస్ట్ చేసింది శృతి హాసన్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com