Shyam Singha Roy: ఆస్కార్ బరిలో 'శ్యామ్ సింగరాయ్'.. ఆ మూడు విభాగాల్లో..

Shyam Singha Roy: ఆస్కార్ బరిలో శ్యామ్ సింగరాయ్.. ఆ మూడు విభాగాల్లో..
X
Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ కూడా ఆస్కార్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకుంది.

Shyam Singha Roy: ఆస్కార్ అనేది తెలుగు సినిమాకు చాలావరకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. కానీ ఇప్పుడు ప్రపంచ సినిమాలు సైతం తెలుగు చిత్రాలవైపు చూస్తున్నాయి. దానికి కారణం రాజమౌళితో పాటు మరికొందరు యంగ్ డైరెక్టర్ల క్రియేటివ్ కథలు కూడా. అందుకే నేచురల్ స్టార్ నాని నటించిన 'శ్యామ్ సింగరాయ్' కూడా ఆస్కార్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకుంది.

నేచురల్ స్టార్ నాని.. ఓవైపు కమర్షియల్ కథల్లో నటిస్తూనే అప్పుడప్పుడు కొన్ని ప్రయోగాత్మక చిత్రాల్లో కూడా నటించాడు. అలాంటి ఒక చిత్రమే 'శ్యామ్ సింగరాయ్'. ఈ సినిమా కోసం నాని పూర్తిగా తన గెటప్‌ను కూడా మార్చేశాడు. ఇక ఇందులో సాయి పల్లవి నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పునర్జన్మ అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని చాలా క్రియేటివ్‌గా తెరకెక్కించాడు దర్శకుడు రాహుల్ సంకిృత్యాన్.


శ్యామ్ సింగరాయ్ ఆస్కార్ నామినేషన్స్‌లో 'క్లాసికల్ కల్చర్ డ్యాన్స్ ఇండియన్ ఫిల్మ్', 'బ్యాక్‌గ్రౌండ్ స్కోర్', 'పీరియాడిక్ ఫిల్మ్'.. ఈ మూడు విభాగాల్లో చోటు దక్కించుకుంది. దీంతో మూవీ టీమ్ అంతా ఫుల్ ఖుషీలో ఉన్నారు. అంతే కాకుండా నాని ఫ్యాన్స్ కూడా ఈ సినిమాకు అవార్డు దక్కాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం నాని.. తన తరువాతి చిత్రం 'దసరా' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

Tags

Next Story