అపస్మారస్థితిలో గాయని కల్పన.. వెంటిలేటర్ పై చికిత్స

అపస్మారస్థితిలో గాయని కల్పన.. వెంటిలేటర్ పై చికిత్స
X
గాయని కల్పన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. సమాచారం అందుకున్న ఇరుగు పొరుగు వారు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో వైద్యులు ఆమెను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.

గాయని కల్పన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. సమాచారం అందుకున్న ఇరుగు పొరుగు వారు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో వైద్యులు ఆమెను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.

హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ కాలనీలో నివసిస్తున్న కల్పన మంగళవారం సాయింత్రం చెన్నైలో ఉంటున్న తన భర్తకు ఫోన్ చేసి తాను అపస్మారకస్థితిలోకి వెళ్తున్నట్లు చెప్పారు. ఆయన వెంటనే కాలనీ సంఘ ప్రతినిధులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. వారు పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. వారు వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే కల్పన స్పృహ కోల్పోయి ఉంది. పోలీసులు హుటాహుటిన ఆమెను సమీపంలోని హోలిస్టిక్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో క్రిటికల్ కేర్ యూనిట్ లో ఉంచి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.

విషయం తెలుసుకున్న తోటి సింగర్స్ ఆస్పత్రికి చేరుకుని కల్పన పరిస్థితి గురించి, ఆమెకు జరుగుతున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సునీత, గీతామాధురి, శ్రీకృష్ణ, కారుణ్య తదితరులు కల్పనను పరామర్శించిన వారిలో ఉన్నారు.

Tags

Next Story