ఆసుపత్రిలో కోలుకుంటున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

ఆసుపత్రిలో కోలుకుంటున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
ఆసుపత్రిలో కోలుకుంటున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

కరోనాతో పోరాడుతూ చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని చెన్నై ఎంజీఎం ఆస్పత్రి తెలిపింది. వైద్యులు అడిగినదానికి ఆయన స్పందిస్తున్నారని హెల్త్‌ బులెటిన్‌లో వెల్లడించింది. బాల సుబ్రహ్మణ్యంకు వెంటిలేటర్‌, ఎక్మో సహాయం చికిత్స కొనసాగుతోందని పేర్కొంది. ఫిజియోథెరపీ చికిత్స చేస్తున్నామని హాస్పిటల్‌ వర్గాలు తెలిపాయి. వైద్య నిపుణుల బృందం ఎప్పటికప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని తెలిపింది.

మరోవైపు... బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ వీడియో సందేశం విడుదల చేశారు. 'నాన్న ఆరోగ్యం రోజు రోజుకు మెరుగవుతోందని అన్నారు. ఇదొక శుభపరిణామమని తెలిపారు. అభిమానులు, శ్రేయోభిలాషుల ప్రార్థనలకు ధన్యవాదాలు అని అన్నారు. ఎస్పీ బాలు కరోనాతో ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆస్పత్రిలో చేరారు. ఐసీయూలో వెంటిలేటర్, ఎక్మో సహాయంతో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఊపిరితిత్తులు కూడా మెరుగుపడినట్టు వైద్యులు వెల్లడించారు. కొన్నిరోజులుగా చేస్తున్న ఫిజియోథెరపీకి కూడా బాలు శరీరం సహకరిస్తున్నట్టు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story