నితిన్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. సునీతా రామ్ స్పెషల్ అట్రాక్షన్

చాలా మంది టాలీవుడ్ హీరోలు లాక్టౌన్ పీరియడ్‌లో పెళ్లిళ్లు చేసుకుని ఒకింటి వారయ్యారు. అందులో హీరో నితిన్ కూడా ఒకరు. పెళ్లైన తరువాత వరుస సినిమాలు చేస్తూ దూసుకెళుతున్న నితిన్.. భార్య షాలిని, సింగర్ సునీతా రామ్‌ల సమక్షంలో తన పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నారు.
రెండోసారి కోవిడ్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నితిన్ పుట్టినరోజును చాలా కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి సింగర్ సునీత, ఆమె భర్త హాజరయ్యారు. పుట్టినరోజు వేడుకలో అందరూ కలిసి ఎంజాయ్ చేశారు. సునీత భర్త రామ్ వీరపనేనితో కలిసి నితిన్ ఇంట్లో జరిగే వేడుకలను ఆస్వాదించారు.
ఆ తర్వాత ఇద్దరూ కలిసి కెమెరా ముందు ఫోజులిచ్చారు. దీంతో వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది ప్రముఖులు నితిన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సునీత భర్త రామ్‌తో నితిన్‌కు సన్నిహిత సంబంధం ఉందని గతంలో విన్నాము. సునీత-రామ్ వివాహ కార్యక్రమంలో నితిన్ తన భార్య శాలినితో కలిసి సందడి చేశాడు. సునీత ఫ్రీ వెడ్డింగ్ వేడుకలను కూడా నితిన్ నిర్వహించడం చూస్తే, వారి మధ్య స్నేహం ఎంత బలంగా ఉందో తెలుస్తుంది.
కాగా, నితిన్ జయాపజయాలను పక్కనపెట్టి మంచి జోష్‌తో వరుస సినిమాలు చేస్తున్నాడు. అతను తన తాజా చిత్రం 'రంగ్ దే'తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. జూన్లో మరో కొత్త ప్రాజెక్ట్' మాస్ట్రో'తో రాబోతున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com